Asianet News TeluguAsianet News Telugu

2024 జనవరిలో అయోధ్య రామ మందిరం తెరుస్తాం - ట్రస్ట్ సభ్యుడు చంపత్ రాయ్

2024 జనవరిలో భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని తెరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ ఖేస్త్ర ట్రస్టు సభ్యుడు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.

Ayodhya Ram Mandir to open in January 2024 - Trust Member Champat Roy
Author
First Published Oct 25, 2022, 4:42 PM IST

రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత 2024 జనవరిలో అయోధ్య రామాలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరుస్తామని  శ్రీరామ జన్మభూమి తీర్థ ఖేస్త్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మంగళవారం తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని చెప్పారు.

మహిళను తదేకంగా చూసిన వ్యక్తి చెంప పగులగొట్టిన పోలీసు.. తర్వాతి రోజు పగతీర్చుకున్న నిందితుడు

2024 జనవరిలో మకర సంక్రాంతి పర్వదినాన పుణ్యక్షేత్రం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఆలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌ను సిద్ధం చేస్తామని అన్నారు.

బంగ్లాదేశ్ లో ‘సిత్రాంగ్’ విలయతాండవం.. 16కు చేరిన మృతుల సంఖ్య.. కరెంటు లేక 10 మిలియన్ల మంది అవస్థలు

రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్లు ఖర్చవుతుందని చంపత్ రాయ్ అంచనా వేశారు. ప్రముఖ హిందూ దార్శనికుల విగ్రహాల కోసం స్థలం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఈ జన్మభూమి తీర్థ ఖేస్త్ర ట్రస్టును ఏర్పాటు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios