ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ ఎదుటే తన బైక్ కు నిప్పు పెట్టాడు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపైకి రాళ్లు రువ్వాడు. ఓ మహిళను తదేకంగా చూశాడన్న ఆరోపణలతో ఓ పోలీసు అధికారి నిందితుడిని నిన్న కొట్టాడని తెలిసింది.అందుకే తర్వాతి రోజు ఆదివారంనాడు నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఫేమస్ ఖాన్ మార్కెట్‌లో ఓ దుండగుడు పోలీసు స్టేషన్ ముందు తన బైక్ తగులబెట్టాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపైకి రాళ్లు విసిరాడు. అక్కడ వాతావరణమంతా నాటకీయంగా మారింది. చివరకు పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకు క్రితం రోజు అక్కడే ఓ పోలీసు నిందితుడి చెంప చెల్లుమనిపించాడు. దీనికి రివేంజ్‌గా ఈ రోజు ఖాన్ మార్కెట్‌లో ఆ వ్యక్తి హైడ్రామాకు తెరలేపాడు.

పోలీసు వర్గాల ప్రకారం, నిన్న 23 ఏళ్ల నదీమ్.. ఖాన్ మార్కెట్‌కు వచ్చాడు. ఆయన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఖాన్ మార్కెట్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడానికి బయట వెయిట్ చేస్తున్నాడు. అదే సమయంలో దంపతులు అక్కడి నుంచి వెళ్లుతున్నారు. నదీమ్ తనను తదేకంగా చూశాడని ఆ మహిళ ఆరోపించింది. అక్కడే ఉన్న పోలీసు ఔట్‌పోస్టు దగ్గకు వెళ్లి పోలీసుకు మౌఖికంగా ఫిర్యాదు చేసింది. రాతపూర్వకంగా ఏ ఫిర్యాదు ఇవ్వలేదు.

Scroll to load tweet…

Also Read: దుస్తులు విప్పించి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి ఆవేదన..

ఆమె ఫిర్యాదు తర్వాత డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి నదీమ్ చెంప పగులగొట్టాడు. దీనితో నదీమ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. తర్వాతి రోజు అదే ఖాన్ మార్కెట్‌కు వచ్చాడు. తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారిపై రాళ్లు విసిరాడు. చివరకు పోలీసులు ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేశారు. బైక్ కు అంటున్న నిప్పు సమీపంగా ఉన్న ఓ ఫర్నీచర్ షాప్ వైపు పాకింది. వెంటనే ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. చివరకు పోలీసులు ఆ నిందుతుడిని పట్టుకున్నారు.