అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం

అయోధ్య రామాలయంలో (ayodhya ram temple) కొలువు దీరిన రామ్ లల్లా విగ్రహాన్ని (ram lalla) ఇక కొత్త పేరుతో పిలవనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట (ayodhya pran pratishtha celebrations) జరిగిన రాముడిని ఇక నుంచి ‘బాలక్ రామ్’ (Balak Ram) అని నామకరణం చేసినట్టు పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు.

Ayodhya Ram Lalla statue gets new name From now on, the darshan with that name..ISR

అయోధ్యలో రామాలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ వేడుకను దేశ, విదేశాల్లోనూ భక్తులందరూ టీవీ, సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడ పూజలు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరుతో పిలవనున్నారు.

అయోధ్య రామమందిరం వేళ శ్రీకృష్ణ మందిరం కోసం ప్రతిజ్ఞ ... మంత్రిగారి కఠిన దీక్ష

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్‌ లల్లా విగ్రహం ఐదేళ్ల బాలుడిలా నిలబడిన భంగిమలో ఉన్న రాముడిని సూచిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఆ విగ్రాహాన్ని ‘‘బాలక్ రామ్’’ అని పిలుస్తారు. ముడుపుల కార్యక్రమంలో పాల్గొన్న పూజారి అరుణ్ దీక్షిత్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “జనవరి 22 న ప్రతిష్టించిన శ్రీరాముని విగ్రహానికి 'బాలక్ రామ్' అని పేరు పెట్టారు. రాముడి విగ్రహానికి 'బాలక్ రామ్' అని పేరు పెట్టడానికి కారణం ఆయన ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న చిన్నపిల్లలా కనిపించడమే.’’ అని స్పష్టం చేశారు. 

శతాబ్దాల నిరీక్షణ ముగిసింది.. ప్రతిజ్ఞ నెరవేరింది - ప్రాణ ప్రతిష్ట వేడుకపై పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు..

“నేను మొదటి సారి విగ్రహాన్ని చూసినప్పుడు ఎంతో థ్రిల్ అయ్యాను. నాకు కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. ఆ సమయంలో నేను పొందిన అనుభూతిని వివరించలేను. జనవరి 18న నాకు తొలి దర్శనం లభించింది.’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని మూడు బిలియన్ ఏళ్ల నాటి రాతిపై చెక్కారు. ఈ శిల్పానికి ఉపయోగించిన నీలిరంగు కృష్ణ శిలే (నలుపు రంగు) ను మైసూరులోని హెచ్.డి.కోట తాలూకా, జయపుర హోబ్లీలోని గుజ్జెగౌడనపుర నుండి వెలికితీశారు. మృదువైన ఉపరితల ఆకృతి కారణంగా సాధారణంగా సోప్ స్టోన్ అని దానిని పిలుస్తారు. 

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో రెండు స్కీమ్ లు అమలు చేయనున్న ప్రభుత్వం..

అయోధ్య రామ మందిరం తలుపులు సాధారణ భక్తుల కోసం మంగళవారం తెరుచుకున్నాయి. అయితే సోమవారం అర్థరాత్రి నుంచే ఆలయ సముదాయానికి దారితీసే రామ్ మార్గంలోని ప్రధాన ద్వారం దగ్గర స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు గుమిగూడారు. రాముడి చిత్రాలతో కూడిన జెండాలను చేతపట్టుకుని, 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేస్తూ, ఆలయ తలుపులు తెరవకముందే భక్తులు కొరికే చలిలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ ద్వారాలు తెరుచుకున్న తరువాత ఆ నీలమేఘశాముడి దర్శనం చేసుకొని తరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios