శతాబ్దాల నిరీక్షణ ముగిసింది.. ప్రతిజ్ఞ నెరవేరింది - ప్రాణ ప్రతిష్ట వేడుకపై పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు..

అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట వేడుక (ayodhya pran pratishtha celebrations) నేపథ్యంలో భారత్ కు విదేశాల్లోని ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Former Pakistani cricketer Danish Kaneria) కూడా తన సోషల్ మీడియా ద్వారా రామాలయం ప్రాణ ప్రతిష్ట వేడుకపై స్పందించారు.

Centuries of waiting is over.. Promise fulfilled - Ex-Pak cricketer's comments on Prana Pratishta ceremony..ISR

అయోధ్యలో రామ మందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక పూర్తయ్యింది. అయోధ్య నగరంలో నేటి నుంచి బాల రాముడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా దేశంలోని దేవాలయాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశ, విదేశాల్లోని భక్తులంతా ఇళ్లలో పూజలు జరుపుకున్నారు. అనేక చోట్ల ర్యాలీలు తీశారు. ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తూ, పటాసులు కాలుస్తు మరో సారి దీపావళి వేడుక జరుపుకున్నారు. 

184 మంది మయన్మార్ సైనికులను స్వదేశానికి పంపిన ఇండియా.. ఎందుకంటే ?

ఈ వేడుకలను హిందువులే కాక భారత్ తో పాటు విదేశాల్లో ఉన్న ఇతర మతస్తులు కూడా ఘనం నిర్వహించుకున్నారు. పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీ తారలు సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి సోషల్ మీడియా ద్వారా భారత్ కు శుభాకాంక్షలు తెలిపారు. రామ మందిర నిర్మాణంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా కామెంట్స్ చేశారు.

‘‘శతాబ్దాల నిరీక్షణ ముగిసింది.. ప్రతిజ్ఞ నెరవేరింది.. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది’’ అని కనేరియా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అలాగే మరో వైపు ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ కేశవ్ మహారాజ్ కూడా 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకను పురస్కరించుకుని శ్రీరాముడి చిత్రాన్ని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో రెండు స్కీమ్ లు అమలు చేయనున్న ప్రభుత్వం..

కాగా.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు దేశంలోని వ్యాపారవేత్తలు, క్రీడా హీరోల నుంచి బాలీవుడ్ నటులు, అలాగే ప్రముఖులు హాజరయ్యారు. కోట్లాది మంది భక్తులు ఈ వేడుకను సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించారు. కాగా.. ఆర్కిటెక్ట్ లు చంద్రకాంత్ సోంపురా, ఆయన కుమారుడు ఆశిష్ రూపొందించిన ఈ రామాలయ సముదాయం 70 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ప్రధాన ఆలయ విస్తీర్ణం 2.7 ఎకరాలు, 57,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు రూ .3,500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఇందులో రూ.1,800 కోట్లు ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios