Asianet News TeluguAsianet News Telugu

ఆటో రిక్షా మెర్సిడెన్ కారును అధిగ‌మించింది.. ఉద్ద‌వ్ ఠాక్రేపై ఏక్ నాథ్ షిండే సెటైర్..

తమది సామాన్యుల ప్రభుత్వమని ఏక్ నాథ్ షిండే అన్నారు. ఆటో రిక్షాలో సామాన్యులే ఉంటారని తెలిపారు. అందుకే అది మెర్సిడన్ కారును అధిగమించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రేను ఉద్దేశించి షిండే ట్వీట్ చేశారు. 

Auto rickshaw overtakes Mercedes car.. Ek Nath Shinde satire on Uddav Thackeray..
Author
Mumbai, First Published Jul 6, 2022, 9:02 AM IST

శివ‌సేన చీఫ్, మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపై తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయ‌కుడు, సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాజ‌కీయాల్లోకి రాకముందు త‌న జీవ‌నోపాధిని గుర్తు చేసుకున్నారు. తాను ఆటో న‌డిపింది నిజ‌మే అని ఒప్పుకున్నారు. శివ‌సేన‌పై తిరుగుబాటు చేసి, ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న స‌మ‌యంలో సీఎంను కొంద‌రు నాయ‌కులు ‘ఆటో డ్రైవ‌ర్’ అంటూ ఎగ‌తాళి చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా ఓ ట్వీట్ చేశారు.  

సుపారీ ఇచ్చి హత్యాయత్నం.. మహిళా మెజిస్ట్రేట్, లేడీ ఎస్సైల ప్రమేయం..

‘‘ ఓ ఆటో రిక్షా మెర్సిడెస్ (కారు)ని అధిగమించింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామాన్యులకు చెందినది.’’ అంటూ మ‌రాఠీలో ట్వీట్ చేశారు. గ‌తంలో కూడా ఉద్ద‌వ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను కూడా ఆయ‌న ఇలాంటి కామెంట్ చేశారు. 1990వ ద‌శ‌కంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం క‌సం క‌ర‌సేవ‌కుల ఉద్య‌మాన్ని ప్ర‌స్తావించారు. క‌ర‌సేవకుల పోరాటాన్ని ‘‘మెర్సిడెస్ బేబీ’’ అభినందించలేకపోయారని విమర్శించారు. 

ఐఐటీ విద్యార్థినిపై ఐఏఎస్ ఆఫీసర్ లైంగిక వేధింపులు.. అరెస్ట్..

కాగా.. గత వారంలో మ‌హారాష్ట్రలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామ‌ల నేప‌థ్యంలో శివ‌సేన నాయ‌కుడు, సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆ రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కు అందించేందుకు మెర్సిడ‌న్ కారులో ఉద్ద‌వ్ ఠాక్రే స్వ‌యంగా రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. దీనిని ఉద్దేశించే షిండే ప్ర‌స్తుతం ఆయ‌న‌పై సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. ఆయ‌న రాజీనామా చేసిన మ‌రుస‌టి రోజు (జూన్ 30) సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేశారు. అదే రోజు ఉప ముఖ్య‌మంత్రిగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌త ఆదివారం స్వీక‌ర్ ఎన్నిక జ‌రిగింది. అందులో బీజేపీకి చెందిన‌ ఎమ్మెల్యే రాహుల్ నార్వేక‌ర్ స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యారు. సోమ‌వారం కొత్త ప్ర‌భుత్వం శాస‌న స‌భ‌లో బ‌లం నిరూపించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios