Asianet News TeluguAsianet News Telugu

దేశంలో 5 జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. తొలుత 13 నగరాల్లో అందుబాటులోకి..

భారత్‌లో 5 జీ సేవలకు ప్రధాని నరేంద్ర ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజులు ఉదయం దేశంలో 5 జీ సేవలకు శ్రీకారం చుట్టారు. 

PM Modi launches 5G Services in India
Author
First Published Oct 1, 2022, 10:32 AM IST

భారత్‌లో 5 జీ సేవలకు ప్రధాని నరేంద్ర ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ ఆరో వార్షిక సదస్సును శనివారం ఉదయం మోదీ ప్రారంభించారు. ఈ  వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5 జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఎంపిక చేసిన 13 నగరాల్లో  5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌నగర్ నగరాలు ఉన్నాయి. ఇక, ఇండియా మొబైల్ కాంగ్రెస్ నేటి నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనుంది. 

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. జియో పెవిలియన్‌ను సందర్శించారు. అక్కడ ట్రూ 5G పరికరాలను వీక్షించారు. జియో గ్లాస్ ద్వారా సేవల పరిస్థితిని ఎక్స్‌పీరియన్స్ చేశారు. యువ జియో ఇంజనీర్ల బృందం ద్వారా ఎండ్-టు-ఎండ్ 5G సాంకేతికత స్వదేశీ అభివృద్ధి, పట్టణ, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ డెలివరీ మధ్య అంతరాన్ని తగ్గించడంలో 5G ఎలా సహాయపడుతుందనే తెలుసుకోవడానికి కూడా మోదీ సమయం వెచ్చించారు. ఈ సందర్శనలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్, ఆర్‌ఐఎల్ చైర్మన్ ష్ ముఖేష్ అంబానీ, ఆర్‌జేఐఎల్ చైర్మన్ ఆకాష్ అంబానీ తదితరులు పాల్గొన్నారు.

PM Modi launches 5G Services in India

ఇక, కొద్ది నెలల కిందట 5జీ స్పెక్ట్రం వేలం జరిగిన సంగతి తెలిసిందే.  5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం టెలికాం ఆప‌రేట‌ర్ల నుంచి రూ 1.5 ల‌క్ష‌ల కోట్ల విలువైన బిడ్స్ వ‌చ్చాయి. ఇందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ పాల్గొన్నాయి. మొత్తం 72,098 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ వేలం వేయగా.. 51,236 మెగా హెట్జ్ (71 శాతం) విక్రయించబడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే రెండు మూడేండ్ల‌లో దేశంలోని అన్ని ప్రాంతాల‌కు 5జీ చేరువవుతుంద‌ని అన్నారు. 5జీ అందుబాటు ధ‌ర‌లో ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. 

 

తక్కువ వ్యవధిలో దేశంలో 5G టెలికాం సేవలను 80 శాతం కవరేజీని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. అయితే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5 జీ సేవలు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios