Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : పండగసీజన్ లో భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఇది రెండోసారి...

పండగ వేళ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ఇచ్చాయి. ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. 

Price of LPG cylinder slashed, new rates is here, check
Author
First Published Oct 1, 2022, 8:56 AM IST

ఢిల్లీ : పండుగ సీజన్‌ లో వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు పెద్ద ఊరటను కలిగించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య  గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. 19 కిలోల LPG వాణిజ్య సిలిండర్ ధరలు రూ. 36 వరకు తగ్గించబడ్డాయి. ఓఎంసీలు తగ్గించిన ఈ కొత్త రేట్లు ఈరోజు నుండి.. అంటే అక్టోబర్ 1, 2022 నుండే అమలులోకి వచ్చాయి.

చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించిన ధరల ప్రకారం.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,859.50. ఈ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 25.5 తగ్గింది. దీంతోపాటు కోల్‌కతా, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కూడా ఓఎంసీలు ధరలను తగ్గించాయి.

ఎల్‌పి‌జి సిలిండర్ ధరలో భారీ తగ్గింపు.. వరుసగా 5వసారి.. నేటి నుంచి అమల్లోకి..

నగరాల వారీగా తగ్గిన ధరలను గమనిస్తే.. ముంబైలో, రూ. 32.5 తగ్గి.. సిలిండర్ ధర రూ. 1811.50కి చేరుకుంది. అదేవిధంగా, కోల్‌కతాలో రూ. 36.5 తగ్గించబడి, సిలిండర్ ధర రూ. 1959 అయింది. చెన్నైలో, రూ. 35.5 తగ్గాయి. దీంతో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ కొత్త రేటు రూ. 2009.50గా మారింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సెప్టెంబర్ 1న  వాణిజ్య సిలిండర్ ధరలను రూ.91.5 తగ్గించాయి. ఇప్పుడు రెండోసారి సిలిండర్ ధరలను తగ్గించాయి. 

సెప్టెంబర్‌లో ధరల తగ్గింపు తర్వాత వాణిజ్య సిలిండర్ల ధర ఢిల్లీలో రూ.1,885, కోల్‌కతాలో రూ.1,995.50, ముంబైలో రూ.1,844,  చెన్నైలో రూ.2,045గా ఉంది. ఎల్‌పీజీ సిలిండర్ల ధర జూన్‌లో రూ.2,219కి తగ్గగా, మేలో గరిష్టంగా రూ.2,354గా ఉంది. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios