ఒంటరిగా ఆటో ఎక్కిన బాలింతపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
ముంబై : మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు... కొందరు మగాళ్లలో మృగం బయటకువస్తాడు. చిన్నపిల్లల నుండి పండుముసలి వరకు ఇలాంటి మృగాల చేతిలో అఘాయిత్యాలకు గురవుతున్న దారునాలు అనేకం.చివరకు గర్భంతో వున్నవారిని, బాలింత మహిళలను కూడా వదిలిపెట్టడంలేదు. ఇలా ఓ బాలింతపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన అమానుషం మహారాష్ట్రలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర రాజధాని ముంబైలో నివాసముండే ఓ మహిళ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన రెండునెలలు తర్వాత పని వుండటంతో ఆమె బయటకు వెళ్ళింది. ఈ క్రమంలోనే నవీ ముంబైలోని సిబిడి బెలాపూర్ ప్రాంతంనుండి గోరేగావ్ వెళ్ళేందుకు ఆమె ఓ ఆటో ఎక్కింది. ఒంటరిగా వున్న ఆమెపై కన్నేసిన ఆటోడ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యాని పాల్పడ్డాడు.
మహిళకు అనుమానం రాకుండా బహిర్భూమికి వెళతానని చెప్పి మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలోకి ఆటోను పోనిచ్చాడు డ్రైవర్. ఓ చోటు ఆటోను నిలిపి మహిళపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అత్యాచారం అనంతరం మహిళను విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసవం సమయంలో వేసిన కుట్లు ఊడిపోయాయి. నొప్పితో విలవిల్లాడిపోయిన మహిళను ఆటోలో ఎక్కించి ఓ ప్రాంతంలో వదిలివెళ్లాడు ఆటో డ్రైవర్. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బయపడిపోయిన మహిళ బయటపెట్టలేదు.
Read More వివాహేతర సంబంధం : దూరం పెట్టిందని.. మహిళపై యాసిడ్ దాడి !
మే 17న ఈ దారుణ ఘటన జరగ్గా బాధితురాలు తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత మహిళ నుండి వివరాలు సేకరించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
