సెకన్లలో ఇద్దరు చూస్తుండగానే ఓ ఆటో డ్రైవర్ కనికట్టు చేశాడు. రూ.500 మాయం చేసి.. వందే ఇచ్చారంటూ బుకాయించాడు. ఇదంతా వీడియోలో రికార్డయ్యింది. 

బెంగళూరు : ఆటో మీటర్ల ట్యాంపరింగ్, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం.. రమ్మన్న చోటికి రానంటూ నిరాకరించడం.. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే విషయాలే.. అలాంటి కోవలోకి వచ్చే ఓ మోసమే వీడియోలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాస్త వీటినుంచి రిలీప్ దొరికినా.. 

అయితే బెంగళూరు ఓ ఆటోలో ప్రయాణించిన వారికి జేబులు చిల్లులు పడుతూ ఇది మరోసారి గుర్తుకు వచ్చేలా చేస్తుంది. దీన్ని ఏకంగా బంగ్లాదేశ్ కి చెందిన ఓ యూట్యూబర్ క్లియర్గా చూపెడుతూ వీడియో అప్లోడ్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఏ మార్చి డబ్బులు లూటీ చేస్తున్నాడు. అది ఎలా జరుగుతుందో వీడియోలో చూపించారు ఆ యూట్యూబర్. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

"న్యాయమూర్తి రోబోలా ఉండొద్దు": మరణశిక్ష పడ్డ అత్యాచార దోషికి 'సుప్రీం' ఉపశమనం

బంగ్లాదేశ్ కు చెందిన ఎండి ఫిజ్ అనే వ్యక్తి ‘ఫిజ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అతను ట్రావెలర్. తన పర్యాటక వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటాడు. ఇందులో భాగంగానే అతని ఇటీవల ఇండియాకు వచ్చాడు. బెంగళూరులో ఓ ఆటో ఎక్కాడు.

ఆటోలో తన చేరుకోవాల్సిన చోటుకి చేరుకున్న తర్వాత డ్రైవర్ కి ఫిజ్ రూ. 500 నోటును ఇచ్చాడు. వెంటనే సెకండ్లలో ఆ డ్రైవర్ ఆ నోటును తన చొక్కా మడతలు దాచేసాడు. ఆ తర్వాత అప్పటికే తన చేతిలో సిద్ధంగా ఉన్న రూ.100 నోటును చూపిస్తూ.. అదే ఇచ్చావ్ అంటూ భూకాయించాడు. మొత్తం రూ. 300 అయిందని.. మొత్తం చెల్లించాలని ఆటో డ్రైవర్ పట్టుబట్టాడు. 

దీంతో యూట్యూబర్ ఆ వంద రూపాయలు తీసుకుని… మరో రూ.500 నోటు ఇచ్చాడు. చిల్లర నీ దగ్గరే ఉంచుకోమంటూ వెళ్ళిపోయాడు. ఆటో డ్రైవర్లతో గొడవ మామూలే కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తన యూట్యూబ్ వ్లాగ్ లను ఎడిట్ చేసి అప్లోడ్ చేసే పనిలో పడిపోయాడు ఫిజ్. ఈ క్రమంలోనే వీడియో ఎడిట్ చేస్తున్న సమయంలో తాను మోసపోయినట్లుగా గుర్తించాడు.

ఆటో డ్రైవర్ తో జరిగిన సంభాషణ.. ఆ వీడియోలో రికార్డ్ అయింది. అది వెంటనే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బెంగళూరులో ఆటోలో బయటి రాష్ట్రాల వ్యక్తులు ఎవరు ప్రయాణించొద్దని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రైడ్లకి నిరాకరించడం, అధిక చార్జీలు వసూలు చేయడం లాంటి పనులతో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బెంగుళూరు పోలీసులు ఒక్క జూలై నెలలో 722 కు పైగా కేసులను ఆటో డ్రైవర్ల మీద నమోదు చేశారు. బస్సు రవాణా సౌకర్యం లేని చోట్ల ఆటో డ్రైవర్లు మరీ రెచ్చిపోతున్నారని.. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని బెంగుళూరు నగర ప్రయాణికులు గగోలు పెడుతున్నారు.