Asianet News TeluguAsianet News Telugu

ఔరంగజేబు క్రూరుడు.. కానీ, హిందూ వ్యతిరేకి కాదు: ఎన్సీపీ నేత జితేందర్ అవద్

ఔరంగజేబు క్రూరుడే కానీ, హిందూ వ్యతిరేకి కాదని ఎన్సీపీ నేత జితేందర్ అవద్ అన్నారు. శంభాజీ మహారాజ్‌ను బహదూర్‌గడ్ తీసుకెళ్లి కళ్లు పెరికించారని, కానీ, అక్కడే ఉన్న విష్ణు దేవాలయాన్ని మాత్రం వాళ్లు ధ్వంసం చేయలేదని తెలిపారు. హిందూ వ్యతిరేకి అయి ఉంటే.. ఔరంగజేబు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసేవాడే అని పేర్కొన్నారు.
 

aurangzeb cruel but not anti hindu says ncp leader jitender awhad
Author
First Published Jan 3, 2023, 8:12 PM IST

ముంబయి: మహారాష్ట్ర ప్రతిపక్ష నేత అజిత్ పవార్ వ్యాఖ్యలను సమర్థిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జితేంద్ర అవద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా కింగ్ శంభాజీ మహారాజ్ తన జీవితకాలంలో ఎప్పుడూ మతాన్ని ఆచరించలేదని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన ముఘల్ పాలకులను ప్రస్తావించారు. 

పవార్ వ్యాఖ్యలను పేర్కొంటూ.. తొలినాళ్లలో మరాఠా ఒక క్యాస్ట్ కాదని,అదొక ధర్మం అని, దాన్ని ఆచరించేవాళ్లు అని వివరించారు. దాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ ముందుకు తీసుకెళ్లాడని చెప్పారు. శంభాజీ మహారాాజ్ ఈ ధరాన్ని స్థాపించారని, ఇది క్యాస్ట్ కాదని తెలిపారు. 

మీడియాతో మాట్లాడుతూ, ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ ను బహదూర్‌గడ్‌ కు తీసుకెళ్లి కళ్లు పెరికించారని చెప్పారు. బహదూర్‌గడ్ కోట వద్ద ఓ విష్ణు దేవాలయం ఉన్నదని అన్నారు. ఔరంగజేబు క్రూరుడే కానీ, హిందూ వ్యతిరేకి కాదని తెలిపారు. ఒక వేళ హిందూ వ్యతిరేకి అయి ఉంటే ఆయన విష్ణు దేవాలయాన్ని ధ్వంసం చేసేవాడే అని పేర్కొన్నారు. ఔరంగజేబు అతని సోదరుడు, తండ్రిని చంపేశాడని, అతడు క్రూరుడు అని చెప్పారు.

Also Read: ఛత్రపతి శివాజీని అవమానించారు.. కాషాయ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి: మహారాష్ట్ర బీజేపీ పై కాంగ్రెస్ ఫైర్

సీఎం షిండే స్పందిస్తూ ఎన్సీపీ ఛత్రపతి శంభాజీని అవమానించి ఔరంగజేబును ప్రశంసిస్తున్నదని అన్నారు. ఔరంగజేబు ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేశాడని, మహారాష్ట్రలో హిందూ మహిళలను వేధించాడని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios