Asianet News TeluguAsianet News Telugu

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తుండగా.. లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 25 మంది మృతి

హరిద్వార్‌లోని లాల్‌ధాంగ్ నుండి పౌరీ జిల్లాలోని కందా గ్రామానికి ఊరేగింపుగా వెళ్తున్న బస్సు బీరోంఖల్ సిమ్డి బ్యాండ్ సమీపంలో లోయ‌లో ప‌డింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మందికి పైగా మరణించారు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశారు

Uttarakhand Pauri Accident News: Wedding Bus Fell Into Ditch Near Bride House
Author
First Published Oct 5, 2022, 5:44 AM IST

ఉత్తరాఖండ్ ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది. లాల్‌ధాంగ్‌లోని కటేవాడ్ గ్రామం నుండి హరిద్వార్ జిల్లాలోని కంద తల్లాకు వెళ్తున్న బస్సు లాన్స్‌డౌన్‌లోని సిమ్డి గ్రామం సమీపంలో సుమారు మూడున్నర వందల మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మందికి పైగా మరణించారు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశారు.

ప్ర‌మాదం సమ‌యంలోబస్సులో దాదాపు 45 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తున్న‌ బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను ర‌క్షించ‌డానికి గ్రామస్తుల సహాయంతో సహాయ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. 

ఘ‌ట‌న స్థలానికి వైద్యుల బృందం
 
బిరోంఖల్ ఆరోగ్య కేంద్రం నుండి ఐదుగురు వైద్యుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. ఇద్దరు చిన్నారులతో సహా గాయపడిన ఆరుగురిని బీర్‌ఖాల్ ఆరోగ్య కేంద్రానికి, ఒకరికి గాయపడిన వారిని కోట్‌ద్వార్ ఆసుపత్రికి తరలించారు.
 
ముఖ్యమంత్రి విచారం 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేస్తూ సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తామన్నారు. ఘటనపై అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూష్గ్యాన్ సంతాపం తెలిపారు. ఈ విషయమై పౌరీ జిల్లా మెజిస్ట్రేట్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
  
సాయంత్రం ఏడు గంటల సమయంలో రిఖ్‌నిఖాల్-కంద తల్లా మధ్య సిమ్‌డి గ్రామానికి కిలోమీటరు ముందు బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయిందని బస్సులో ఉన్న లాల్‌ధాంగ్‌కు చెందిన పంకజ్ తెలిపారు.

బస్సులో ఉన్న ఎనిమిది నుంచి పది మంది ఎలాగోలా లోయ‌లో నుంచి బయట ప‌డ్డారు. జరిగిన విషయాన్ని మొబైల్ ఫోన్ ద్వారా తెలియజేశారు. సహాయక చర్యల్లో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సు కాలువలో వేలాడుతున్నదని, ఎవరైనా అందులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తే, బస్సు నదిలో పడిపోతుందని పంకజ్ చెప్పాడు.

రిఖ్‌నిఖాల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అరవింద్‌ కుమార్‌, పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనా స్థలంలో ఉన్న బ్లాక్‌ చీఫ్‌ రాజేష్‌ కందారి మాట్లాడుతూ.. రోడ్డుకు మూడున్నర మీటర్ల దిగువన ఉన్న గుంతలో బస్సు ఇరుక్కుపోయిందని తెలిపారు.
 
బస్సు కాలువలో పడిపోవడంతో చాలా మంది ప్రయాణికులు బస్సులో నుంచి బయటపడ్డారు. అనేక  మృతదేహాలు కూడా బస్సు బయట పడి ఉన్నాయి. బస్సులో 25 మంది ప్రయాణికులు చనిపోయారని, వారిలో 12 మంది మృతదేహాలు బస్సు బయటే ఉన్నాయని పోలీసులు చెప్పారు. బస్సులో కొన్ని మృతదేహాలు ఉన్నాయని చెప్పారు. కానీ, బస్సు ఇరుక్కున్న చోటికి చేరుకోవడం కష్టంగా మారుతోందని స‌హాయ‌క బృందాలు అంటున్నాయి. 
 
సహాయక చర్యల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్‌, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్, టార్చ్ వెలుగులో గ్రామస్తులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని స్థానిక నివాసి అనూప్ పట్వాల్ తెలిపారు. కాలువలో పొదలు ఉండడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios