ఓ బాలికపై క్లాస్ మేట్స్ అరాచకానికి ఒడిగట్టారు. ఆమెను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, వేరే ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. 

పూణెలో దారుణం జరిగింది. ఓ బాలికను ఆరుగురు క్లాస్ మేట్స్ కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన బాలుర అందరి వయస్సు 16 సంవత్సరాలే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.

ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న కారు.. పారిపోయిన వరుడు.. ట్విస్ట్ మాములుగా లేదు.. !

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణె ఖరాడీలోని హౌసింగ్ సొసైటీ లో బాధిత బాలిక, నిందితులు నివసిస్తున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుతున్నారు. ప్రస్తుతం స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్ కు హాజరవుతున్నారు. అయితే ఆరుగురి నిందితుల్లో ఒకరితో బాలికకు పరిచయం ఉంది. ఈ క్రమంలో మంగళవారం బాలికను ఆరుగురు బాలురు వచ్చి కిడ్నాప్ చేశారు. అనంతరం ముండ్వాలోని ఓపెన్ ప్లాట్ కు తీసుకెళ్లి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 

దీంతో బాధితురాలు చందన్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆరుగురు బాలురు ద్విచక్రవాహనాలపై తన హౌసింగ్ సొసైటీకి చేరుకుని తనను బలవంతంగా ముండ్వాలోని బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లారని మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 377 (అసహజ నేరం), 363 (కిడ్నాప్), 323 (గాయపరచడం) సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద శిక్షార్హమైన నేరాల కింద కేసు నమోదు చేశారు.

రోడ్డు మీద ట్రక్కు ఆపి...చెరకు గడులు లాగేసిన ఏనుగు... వైరల్ వీడియో..!

ద్విచక్రవాహనాలపై తనను తీసుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ ఆరుగురు బాలురపై మోటారు వాహనాల చట్టం కింద మైనర్ డ్రైవింగ్ అభియోగాలు మోపలేదు. ప్రస్తుతానికి మరింత తీవ్రమైన అభియోగాలపై దృష్టి సారించామని, మైనర్ డ్రైవింగ్ సమస్యపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చందన్ నగర్ పోలీస్ సీనియర్ ఇన్ స్పెక్టర్ రాజేంద్ర లంగే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు.

పూరీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 100 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..

బాధితురాలి తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో చిన్న దుకాణం నడుపుతూ సామాజిక సేవ చేస్తున్నారు. మిగతా మైనర్ల తల్లిదండ్రులు ప్రైవేటు కంపెనీల్లో క్లరికల్, ఆఫీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. ‘‘మంగళవారం హోలీ కావడంతో విద్యార్థులందరికీ సెలవు ఉంది. నిందితులు నాలుగు మోటారు సైకిళ్లు, స్కూటర్లపై బాధితురాలి ఇంటికి వెళ్లారు. బలవంతంగా ఆమెను మోటారు సైకిళ్లపై కూర్చోబెట్టి ముండ్వాలోని ఓపెన్ ప్లాట్ కు తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత బాలురు బాధితురాలిని చెంపదెబ్బ కొట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.’’ అని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చామని, తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుపర్చాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి విద్యార్థులంతా బోర్డు పరీక్షకు హాజరవుతున్నారని, కాబట్టి ఈ సమయంలో వారిని నిర్బంధించి ప్రశ్నించడం సరికాదని చెప్పారు.