చెరకుగడలు కనిపించే సరికి..రోడ్డు మీద వెళ్తున్న ట్రక్కును అడ్డంగా ఆపేసి మరీ.. దానికి కావాల్సిన చెరుకుగడ అది తీసేసుకుంది. ఇది ఎక్కడ జరిగింది అనే విషయం తెలీదు కానీ... వీడియో వైరల్ గా మారింది.

జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా... అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తున్న ఓ ట్రక్కును ఆపి మరీ.. దానికి కావాల్సినది తీసుకుంది. ఇంతకీ ఆ ట్రక్కులో ఏమంది అనే కదా మీ డౌట్. అందులో నోరూరించే చెరుకుగడలు ఉన్నాయి.

మామూలుగానే ఏనుగులకు చెరకుగడలు అంటే అమితమైన ప్రేమ. అవి కనిపిస్తే ఇక ఊరుకుంటాయా..? ఈ ఏనుగు కూడా అంతే... చెరకుగడలు కనిపించే సరికి..రోడ్డు మీద వెళ్తున్న ట్రక్కును అడ్డంగా ఆపేసి మరీ.. దానికి కావాల్సిన చెరుకుగడ అది తీసేసుకుంది. ఇది ఎక్కడ జరిగింది అనే విషయం తెలీదు కానీ... వీడియో వైరల్ గా మారింది.

Scroll to load tweet…

వీడియోకి క్యాప్షన్ గా.."ది టోల్ ట్యాక్స్ కలెక్టర్" అనే క్యాప్షన్ జత చేయగా... అది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్న క్లిప్‌లో, ఒక ఏనుగు రోడ్డు మధ్యలో ట్రక్కును ఆపి, దాని నుండి చెరకులను లాక్కొని, వాటిని విందు చేస్తోంది.

ఈ వీడియో ఇప్పటివరకు సుమారు 2,30,000 వీక్షణలు, 1000కి పైగా రీట్వీట్‌లు ,6,000కు పైగా లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు కామమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏనుగు కోసం ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని ఆపడం నెటిజన్లను మరింత ఎక్కువగా ఆకట్టుకోవడం విశేషం.

"ప్రజలు ఏదో ఒకవిధంగా ముందుకు సాగడానికి ప్రయత్నించడం కంటే ఎలా సహకరిస్తున్నారనేది నాకు చాలా ఇష్టం. వారు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారని అనిపిస్తుంది." అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

"కానీ నిజం ఏమిటంటే, చెరకులోని చక్కెర కంటెంట్‌ను తనిఖీ చేయడానికి చక్కెర మిల్లు నాణ్యత నియంత్రణ సెల్ ద్వారా జంబోను పంపించారు" అని మరో నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.