ఒడిశాలో దారుణం.. 14 ఏళ్ల బాలుడి నరబలి.. కాళ్లు, చేతులు నరికేసి, కళ్లను కూడా..

ఒడిశాలో ఓ బాలుడి దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడి కాళ్లు, చేతులను దుండగులు నరికారు. అలాగే కళ్లను కూడా పొడిచారు. ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు రోజుల తరువాత బాలుడు ఇలా హతమై కనిపించాడు.

Atrocity in Odisha.. Human sacrifice of 14-year-old boy.. Legs, hands and eyes were cut off..ISR

ఒడిశాలో దారుణం వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఇది నరబలిగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుగుల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 

థానేలో ఘోర ప్రమాదం.. గిర్డర్ లాంచర్ కూలి 15 మంది మృతి, మరో ముగ్గురికి గాయాలు

వివరాలు ఇలా ఉన్నాయి. అనుగుల్ జల్లా సుబర్జాపుర్ గ్రామానికి చెంది సుంచిత్ కు కొంత కాలం నుంచి ఆరోగ్యం బాగాలేదు. దీంతో తల్లి బసంతి బాలుడిని సమీపంలోని మంగళ కోఠి ఆలయానికి తీసుకెళ్లింది. అక్కడ బాలుడి ఆరోగ్యం కోసం జూలై 22వ తేదీన పూజలు నిర్వహించింది. అక్కడే ఉండే రీతాంజలి అనే మహిళ ఆ ఆలయాన్ని నిర్వహిస్తోంది. 

మహిళతో యువకుడి వివాహేతర సంబంధం.. బట్టలూడదీసి, మర్మాంగాలు, నాలుకపై వాతలు పెట్టిన స్నేహితులు..

అయితే జూలై 23వ తేదీ నుంచి బాలుడు కనిపించుకుండా పోయాడు. దీంతో తల్లి ఆందోళన చెందింది. చుట్టు పక్కల గాలించింది. ఎక్కడా సుంచిత్ కనిపించకపోవడంతో జూలై 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో జూలై 28వ తేదీన.. సమీపంలోని ఓ చెట్టుకు బాలుడు వేలాడుతూ కనిపించాడు. అప్పటికే బాలుడు చనిపోయి ఉన్నాడు. కాళ్లు, చేతులు నరికి ఉండటం, కళ్లు కూడా పొడిచి ఉండటం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

గద్దర్‌కు గుండెపోటు: హైద్రాబాద్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స

ఇది నరబలి అని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానించారు. బాలుడు తల్లి ఫిర్యాదు మేరకు రీతాంజలి, ఆమె ముగ్గురు కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios