మహిళతో యువకుడి వివాహేతర సంబంధం.. బట్టలూడదీసి, మర్మాంగాలు, నాలుకపై వాతలు పెట్టిన స్నేహితులు..

ఓ యువకుడిని అతడి ముగ్గురు స్నేహితులు చిత్ర హింసలు పెట్టారు. బట్టలూడదీసి మర్మాంగాలు, నాలుకపై వాతలు పెట్టారు. బాధితుడి వారి నుంచి తప్పించుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్ లో చేర్పించి, ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

A young man's extramarital relationship with a woman. Friends who are undressed, sarcastic, and tongue-tied..ISR

వారు నలుగురు స్నేహితులు. వారిలో ఒకరు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమెకు ఇది వరకే పెళ్లయ్యింది. ఈ వివాహేత సంబంధం వల్ల ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయం అతడి స్నేహితులకు నచ్చలేదు. దీంతో ఆ యువకుడిని మద్యం తాగేందుకు పిలిచి, అనంతరం చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. 

గద్దర్‌కు గుండెపోటు: హైద్రాబాద్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స

పోలీసులు వెల్లడించిన వివరాలు, ‘ఈనాడు’ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణకు తుఫ్రాన్ లో సాయి, జితేందర్ తో పాటు ఇంకో వ్యక్తి స్నేహితులుగా ఉన్నారు. నారాయణ ఓ మహిళతో వివాహేత సంబంధం మొదలుపెట్టాడు. దీంతో పాటు ఇతర కారణాల వల్ల ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయం అతడి స్నేహితులకు కోపం తెప్పించింది. నారాయణపై మిగిలిన ముగ్గురూ కక్ష పెంచుకున్నారు. కోపాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు స్నేహితులు మాట్లాడుకొని ఆదివారం రాత్రి నారాయణను తుఫ్రాన్ కు పిలిపించారు.

Khairatabad: ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌!.. దానం నాగేందర్‌కు లైన్ క్లియర్.. మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం

స్నేహితులు అంతా కలిసి తుఫ్రాన్ లోనే ఉన్న సాయి ఇంట్లో మద్యం సేవించారు. రాత్రి 11 గంటల సమయంలో నారాయణను ముగ్గురు స్నేహితులు బట్టలూడదీసి, కరెంట్ తీగలో కట్టేసి, శరీరంపై వాతలు పెట్టారు. అలాగే సున్నిత ప్రదేశాలైన మర్మాంగాలు, నాలుకపై కూడా వాతలు పెట్టి, చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో బారి నుంచి నారాయణ ఎలాగోలా తప్పిచుకున్నాడు. 

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి నిర్ణయం, వరద సహాయం కింద రూ. 500 కోట్లు: కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేటీఆర్

నేషనల్ హైవే 44 నుంచి దాబాల దగ్గరకు వచ్చాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే తుఫ్రాన్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios