ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. కాంకేర్ జిల్లాలోని ఓ గ్రామంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. దీంతో ఆ గ్రామానికి చెందిన యువకుడు మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. 

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) బుధవారం పేలడంతో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరొకరికి గాయలు అయ్యాయి. కొరార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భైంస్గావ్ గ్రామ సమీపంలో ఈ ఉదయం ఈ ఘటన జరిగిందని కంకేర్ పోలీసు సూపరింటెండెంట్ శలభ్ సిన్హా ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు తెలిపారు.

సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టులపై కేజ్రీవాల్ నిరసన.. హోలీ జరుపుకోకుండా ఈరోజంతా మెడిటేషన్..

తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు ప్రెజర్ ఐఈడీ కనెక్షన్ ను తాకారని, దీంతో పేలుడు సంభవించిందని సిన్హా పేర్కొన్నారు. దీంతో వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. మృతుడిని బీరేశ్ మాండవిగా గుర్తించామని, క్షతగాత్రుడిని ఖిలేష్ కొర్రంకు గుర్తించామని తెలిపారు. కాగా.. నక్సలైట్ల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.

బిగ్ బాస్ ఫేమ్ అర్చన‌తో అనుచిత ప్రవర్తన.. ప్రియాంక గాంధీ పీఏ సందీప్‌పై కేసు నమోదు..

ఇలాంటి ఘటనే గత నెల 22వ తేదీన జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్‌లో చోటు చేసుకుంది. చైబాసాలోని గోయిల్‌కేరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేరల్‌గడ గ్రామ సమీపంలో మావోయిస్టులు జరిపిన ఐఈడీ పేలుడులో 23 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అతడు కట్టెలు సేకరించేందుకు అడవికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

భార‌త ప‌ర్య‌ట‌న‌కు ఆస్ట్రేలియా ప్రధాని.. ప‌లు కీల‌క అంశాల‌పై పీఎం మోడీతో చ‌ర్చ

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఇదే కాంకేర్ జిల్లాలో గత నెల 26వ తేదీన ఓ ఆర్మీ జవాన్ ను మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడిని బడే తెవాడా నివాసి మోతీరామ్ ఆంచలగా గుర్తించారు. ఈ ఆర్మీ జవాన్ కొన్ని రోజుల క్రితం సెలవులపై తన స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు వచ్చారు. అయితే శనివారం ఉసేలిలోని చికెన్ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. అదే వారంలో మొత్తం ఆరుగురు జవాన్లను మావోయిస్టులు హతమార్చడం గమనార్హం. ఆ వారం ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) జవాన్లు మరణించారు. అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) భద్రతా సిబ్బంది చనిపోయారు.