Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో దారుణం.. బాలికపై అత్యాచారం.. రూ. 5 ల‌క్ష‌ల ఖ‌రీదు క‌ట్టిన పంచాయ‌తీ

బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గ్రామ పంచాయతీ పెద్దలకు తెలిసింది. దీంతో బాధితురాలికి రూ.5 లక్షలు చెల్లించి సమస్యను పరిష్కరించాలని నిందితుడికి సూచించారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. 

Atrocity in Bihar.. Rape of girl.. Rs. Panchayat costing 5 lakhs
Author
First Published Sep 3, 2022, 4:23 PM IST

పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఓ వ్య‌క్తిపై బాలికపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రెండేళ్లుగా ఆమెపై ప‌లుమార్లు అఘాయిత్యానికి ఒడిగ‌ట్టారు. త‌రువాత పెళ్లి చేసుకోన‌ని మోసం చేశాడు. ఈ విష‌యం గ్రామ పంచాయ‌తీ పెద్ద‌ల దృష్టికి వ‌చ్చింది. దీంతో ఈ స‌మ‌స్య‌ను గ్రామ‌స్థాయిలోనే  ప‌రిష్క‌రించేందుకు ఆ గ్రామ పెద్ద‌లు ఆ యువ‌కుడికి ఫెనాల్టీ విధించారు. నిందితుడితో రూ.5 ల‌క్ష‌ల బాలిక కుటుంబానికి ప‌రిహారంగా ఇప్పించారు. ఈ ఘ‌ట‌న బీహార్ లో చోటు చేసుకుంది. 

మహిళపై నోరుపారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో పోస్టు చేసి కాంగ్రెస్ విమర్శలు

బీహార్ రాష్ట్రం జముయ్‌లో గత రెండేళ్లుగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి రూ.5 లక్షల పెనాల్టీ విధించారు. బాధితురాలు త‌న అన్యాయం జ‌రిగింద‌ని జిల్లాలోని సికందర పోలీస్ స్టేషన్ కు వ‌చ్చి ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. సింక‌ద‌ర మండ‌లంలోని ఓ  గ్రామానికి చెందిన మహ్మద్ మొహ్సిన్ ఓ బాలిక‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. 

అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైంది వీరే..

పెళ్లి సాకుతో ఆమెపై ప‌లుమార్లు అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడి చేశాడు. మొహసిన్ త‌మ కూతురుకు ఉన్న సంబంధాల గురించి ఆమె కుటుంబ స‌భ్యుల‌కు తెలిసింది. దీంతో త‌మ కూతురును పెళ్లి చేసుకోవాల‌ని ఆమె కుటుంబ స‌భ్యులు అత‌డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే దీనికి అత‌డు ఒప్పుకోలేదు. తాను బాలిక‌ను పెళ్లి చేసుకోబోన‌ని చెప్పాడు.

ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రులు పంచాయ‌తీ పెద్ద‌ల దృష్టికి తీసుకొచ్చారు. వారు మొహసిన్ ను, అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను పంచాయ‌తీకి పిలిపించారు. గ్రామ స‌ర్పంచ్ , పెద్ద‌లు బాధితురాలికి న‌ష్ట ప‌రిహారం చెల్లించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. రూ.5 ల‌క్ష‌ల బాలిక‌కు చెల్లించాల‌ని తీర్పు చెప్పారు. అయితే బాధితురాలు డబ్బులు తీసుకునేందుకు నిరాక‌రించింది. వెంటే స్థానిక సికంద‌ర పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది.

ద‌ళిత బాలిక‌లు వ‌డ్డించార‌ని మిగితా విద్యార్థుల భోజ‌నం పారేయించిన వంట మ‌నిషి.. రాజ‌స్థాన్ లో ఘ‌ట‌న

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ మేము  నిందితుడిపై సంబంధిత IPC సెక్షన్లు 376 (అత్యాచారం), 34 (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. మొహ్సిన్, అతడి తండ్రిని అరెస్టు చేశాం ’’ అని సికందర పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ ఆఫీస‌ర్ BR శర్మ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios