ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. మండుతున్న చితి నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీసి తలనరికి తీసుకెళ్లాడు ఓ యువకుడు. అనంతరం దానిని తన ఇంటి సమీపంలో దాచుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగింది. అక్షరాస్యత కూడా పెరుగుతోంది. మానవుడు కూర్చున్న ప్రదేశంలోని ఎక్కడి వ్యక్తితో అయినా సులభంగా సంభాషించగలుగుతున్నాడు. ప్రస్తుతం మనిషి ఆరచేతిలోకి ప్రపంచం వచ్చినా కానీ కొన్ని మూఢనమ్మకాలను మాత్రం విడలేకపోతున్నాడు. క్షుద్రపూజలు, మంత్రాలు అంటూ ఇంకా మూఢత్వంలోనే మునిగి తేలుతున్నాడు. అంధ భక్తితో తమ ప్రాణాలను తీసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా తీసిన ఘటనలు మనం విన్నాం. మంత్రాల నెపంతో ఇతరలును కొట్టి చంపే వార్తలను కూడా చదివాం. తాజాగా మంత్రాలకు సంబంధించిన, ఎవరూ ఊహించని ఘటన ఒకటి జరిగింది.
Voter ID Card: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 17 ఏళ్లకే Voter ID కి అప్లై చేయొచ్చు..
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మంత్ర తంత్రాలకు సంబంధించిన ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజలు చేసేందుకు ఓ యువకుడు మండుతున్న చితిలో నుండి మృతదేహాన్ని బయటకు తీసి తలనరికాడు. అనంతరం దానిని ఇంటికి తీసుకెళ్లాడు. అతడితో పాటు మరో ఇద్దరు తాంత్రికులు కూడా ఉన్నారు. చితిపై నుంచి మృతదేహం అదృశ్యమైన విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులతో తాంత్రికుడు ఇంటిపై దాడి చేశారు. నిందితుడి ఇంటి నుంచి తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
నదిలోకి దూకిన ఇద్దరు విద్యార్థినులు.. ‘మన పెళ్లికి ఎవ్వరూ ఒప్పుకోరు’ అంటూ సూసైడ్ లెటర్..!
పిప్రౌలి గ్రామానికి చెందిన కుబేర్ గంగ్వార్ అనే వృద్దుడు సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించాడు. దీంతో బంధువులు మృతదేహాన్ని గ్రామం వెలుపల మంగళవారం దహనం చేసి ఇంటికి చేరుకున్నారు. అయితే కొంత సమయం తరువాత అదే గ్రామానికి చెందిన గోపేంద్ర వాల్మీకి తన ఇద్దరు సహచరులతో అక్కడికి చేరుకున్నారు. చిత మంటల్లో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పదునైన ఆయుధంతో శరీరం నుంచి తలను వేరు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత తెగిపడిన తలను తన ఇంటి సమీపంలోని గడ్డిలో దాచాడు. ఇంతలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోపి చేసిన ఈ పనిని చూశాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో ఈ విషయం ఊరంతా వ్యాపించింది. మృతుడి బంధువులు గ్రామస్తులతో కలిసి అతని ఇంటికి చేరుకోవడంతో వివాదం మొదలైంది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. రాజ్యసభ నుంచి మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్
గొడవ పెద్దగా మారడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు గోపేంద్ర వాల్మీని అతడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ సంజీవ్ కుమార్ బాజ్ పాయ్ తెలిపారు. వారిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
