దారుణం.. బాలుడి కడుపు కోసి, అవయవాలను ఎత్తుకెళ్లిన దుండగులు.. బీహార్ లో ఘటన
14 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అనంతరం కడుపుకోసి అవయావాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బీహార్ లోని అరారియా జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండుగులు ఘోరంగా హతమార్చారు. అనంతరం కడుపు కోసి, శరీర అవయవాలను ఎత్తుకెళ్లిపోయారు. అరారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.
వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 100 మంది మృతి, 150 మందికి గాయాలు
వివరాలు ఇలా ఉన్నాయి. చకోర్బా వార్డు నెంబర్ 5లో 14 ఏళ్ల మంతు కుమార్ పాశ్వాన్ తన తండ్రి తారాచంద్ తో కలిసి జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. కానీ ఎంత సేపటికి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తండ్రి కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాలో వెతికాడు. కానీ బాలుడి ఆచూకీ కనిపించలేదు.
అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని నోట్ రాసి.. గ్రామ సర్వేయర్ ఆత్మహత్యాయత్నం..
అయితే మరుసటి రోజు ఉదయం బత్నాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని పథర్‌దేవా మిడిల్ స్కూల్ వరండాలో ఆ బాలుడి మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. ఈ విషయం తండ్రికి తెలియడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తీవ్రంగా రోదించాడు. ఆ బాలుడి కడుపు కోసి, శరీర అవయాలు ఎవరో చోరీ చేసినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు.
చనిపోయి మూడు నెలలైనా ఇంట్లోనే వృద్ధురాలి మృతదేహం.. ఏలూరులో ఘటన
ఈ హత్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని గమనించిన అధికారులు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పలు పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించారు. అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా..మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ కేసుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.