చనిపోయి మూడు నెలలైనా ఇంట్లోనే వృద్ధురాలి మృతదేహం.. ఏలూరులో ఘటన
ఏలూరులో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె చనిపోయిన మూడు నెలలుగా ఇంట్లోనే డెడ్ బాడీ ఉండిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఓ వృద్ధురాలు చనిపోయి మూడు నెలలు అయినా.. ఆ ఇంట్లోనే మృతదేహం ఉండిపోయింది. దీంతో ఆమె మృతదేహం దాదాపు అస్థి పంజరంగా మారిపోయింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగెళ్లమూడి యాదవ్ నగర్ ప్రాంతంలో 76 ఏళ్ల శరణార్థి నాగలక్ష్మి తన సొంత ఇంట్లో నివాసం ఉంటోంది. అయితే భర్త మల్లికార్జునరావు విజయవాడ లోని ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసులో జాబ్ చేసేవారు. అయితే రిటైర్డ్ మెంట్ అనంతరం ఆయన చనిపోయారు. దీంతో ఆమెకు పెన్షన్ వస్తోంది. ఆ పెన్షన్ తో ఆమె తన ఇంట్లోని పై పోర్షన్ లో జీవిస్తోంది.
వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 100 మంది మృతి, 150 మందికి గాయాలు
ఆమెకు దుర్గా బసవ ప్రసాద్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన తన భార్య లలితాదేవి తో కలిసి కింద పోర్షన్ లో జీవిస్తున్నారు. అయితే చాలా కాలం నుంచి నాగలక్ష్మి నివసిస్తున్న ఇంటి తలపులు మూసి ఉంటున్నాయి. ఆమె కూడా బయటకు కనిపించడం లేదు. దీనిని స్థానికులు గమనించారు. ఈ విషయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీ టౌన్ పోలీసులు మంగళవారం అక్కడికి చేరుకున్నారు.
వరకట్న వేధింపులకు బలైన నవ వధువు.. సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన..
వారు వృద్ధురాలు నివసిస్తున్న ఇంటి తలుపులు పగులగొట్టి చూశారు. దీంతో వృద్ధురాలు విగతజీవిగా కనిపించింది. నాగలక్ష్మి చనిపోయి దాదాపు మూడు నెలలు గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ డెడ్ బాడీని సర్వజన హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
'రాజకీయ సౌలభ్యం కోసం.. ఉగ్రవాదంపై ఉదాసీనత..' ఐరాస వేదికగా కెనడా, పాక్ ల దుమ్ముదులిపిన భారత్
కాగా.. కొంత కాలం నుంచి వృద్ధురాలు ఆమె కుమారుడు మాట్లాడుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారని ‘ఈనాడు’ పేర్కొంది. ఈ నేపథ్యంలో కుమారుడే తల్లిని ఏదైనా చేశాడా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పోలీసులు నాగలక్ష్మి ఇంటికి వచ్చిన సమయం నుంచి దుర్గా బసవ ప్రసాద్ కనిపించకుండా పోయాడు. తరువాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించడం మొదలుపెట్టారు.