తమిళనాడులో దారుణం జరిగింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఓ కన్న తల్లి కూతురు పట్ల కర్కషంగా వ్యవహరించింది. కూతురును హత్య చేసి, అనంతరం ఆమె కూడా ఆత్మహత్యయత్నించింది.
ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో కన్న కూతురునే తల్లి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే పొరుగువారు దీనిని గమనించారు. ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి రక్షించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.
వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలిలోని సివల్‌పేరి గ్రామంలో ఆరుముగ కని అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు 19 సంవత్సరాల కూతురు అరుణ ఉంది. ఆమె కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. అయితే అరుణ ఓ యువకుడిని ప్రేమించింది. అతడు వేరే సామాజిక తరగతికి చెందిన వ్యక్తి. ఓ సందర్భంలో అరుణ తన ప్రేమ గురించి తల్లికి ఫోన్‌లో చెప్పింది. దీంతో ఆరుముగకని ఇంటికి వచ్చి ఈ విషయంపై మాట్లాడాలని కూతురుకు సూచింది.
తల్లి మాటలు నమ్మిన అరుణ ఇంటిక వచ్చింది. అయితే వెంటనే ఆరుముగకాని వెంటనే తన కులంలోనే ఓ అబ్బాయిని చూసి పెళ్లికి ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. అరుణ దానిని వ్యతిరేకించింది. తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. ఈ విషయంలో మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆరుముగకాని కోపంతో కుమార్తెను గొంతు నులిమింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
వీరి గొడవ వినిపించడంతో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకొని అరుణను చికిత్స నిమిత్తం తిరునల్వేలి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే అరుణ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బాధితురాలి తండ్రి, సోదరుడు చెన్నైలో పనిచేస్తున్నారు.
భార్యకు డ్రగ్స్ ఇచ్చి చంపేసిన నర్స్.. మరో నర్స్‌తో ఎఫైర్.. ఎలా చిక్కాడంటే?
కాగా.. కూతురును తానే హత్య చేశాననే పశ్చాత్తాపంతో ఆరుముగకాని కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను స్థానికులు గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై శివలపేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ లో యూపీలో ఓ రైతు కూడా ఇలాంటి దారుణానికే ఒడిగట్టారు. తన కూతురు తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని షామ్లీలోని గ్రామంలో 56 ఏళ్ల ప్రమోద్ కుమార్ వ్యవసాయం చేస్తుంటారు. ఆయన ఉన్నత కులానికి చెందిన వ్యక్తి. అతడికి 18 ఏళ్ల కూతురు కాజల్ ఉంది. ఆమె వెనకబడిన కులానికి చెందిన యువకుడు అజయ్ కశ్యప్ (20)ను ప్రేమించింది. వీరి ఇద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసింది. ఈ విషయంలో తండ్రి కూతురును హెచ్చరించారు. ఆ యువకుడితో సన్నిహితంగా ఉండకూడదని, ప్రేమ వ్యవహారాన్ని ముగించాలని ప్రమోద్ కుమార్ కాజల్ కు సూచించాడు. కానీ తండ్రి మాటను కూతురు వినిపించుకోలేదు. తక్కువ కులం వ్యక్తితో సంబంధాలు అన్ని తెంచుకోవాలని పలు మార్లు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో సమాజంలో తన పరువు పోతుందని భావించిన తండ్రి కూతురును అంతం చేయాలని భావించాడు.
అయితే ఇటీవల కూతురు కాజల్ ఇంట్లో చెప్పకుండా అజయ్ కశ్యప్ తో బయటకు వెళ్లిపోయింది. ఒక రోజు తరువాత తన ఇంటికి తిరిగి వచ్చింది. సమాజంలో ఎక్కడ తన పరువుకు భంగం కలుగుతుందని ఆందోళన చెందిన ప్రమోద్ కుమార్ బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన రాత్రి ఏదో పని ఉందని కూతురును పొలానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్నితగులబెట్టాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
