ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనాన్ని తెలియజేసేలా వైరల్‌ అవుతున్న ఓ వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సేవే మోదీకి పదే పదే విజయాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనాన్ని తెలియజేసేలా వైరల్‌ అవుతున్న ఓ వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సేవే మోదీకి పదే పదే విజయాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ గురించి సోషియాలజిస్ట్ సాల్వటోర్ బాబోన్స్ చెప్పిన ఈ అంచనాలను ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు. ప్రధాని మోదీ భారత రాజకీయాలను రాజవంశాలు, అర్హత కంటే.. ప్రజా సేవ, కృషి, విశ్వాసం ప్రధానమైనదిగా మార్చారని చెప్పారు. ఆయన నిశ్చయాత్మక లక్ష్యం స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు ఒక మంచిని సృష్టించడం, రేపటి కోసం దేశాన్ని అభివృద్ది చేయడమే మోదీ లక్ష్యమని ట్వీట్ చేశారు. 

రాజీవ్ చంద్రశేఖర్ రీ ట్వీట్ చేసిన పోస్టులో సాల్వటోర్ బాబోన్స్ మాట్లాడుతూ.. విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన ఓ సూక్తిని ప్రస్తావించి మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ రెండు దశాబ్దాలకు పైగా విపరీతమైన పాపులారిటీ కలిగి ఉన్నారని చెప్పారు. బీజేపీ హిందూత్వ అజెండా వల్ల ఇండియాలో ఉన్న 20 శాతం ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేయరని అన్నారు. అయితే నరేంద్ర మోదీ నిరంతం విజయం ఎందుకు సాధిస్తున్నారంటే.. ఆయన తనను తాను ఇండియా అధిపతిగా భావించడం లేదని, ప్రజలకు సేవకుడిగా మాత్రమే అనుకుంటున్నారని చెప్పారు. 

Scroll to load tweet…

మోదీని ఎవరైనా ఎన్నికల్లో ఎదుర్కొవాలంటే.. ఆయనలాగే అంకిత భావంతో కూడిన ప్రజా సేవ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. అందుకే బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. సెల్ఫ్ సర్వీంగ్ పొలిటిషియన్‌కు ఎన్నికలను గౌరవించే, హార్డ్ వర్కింగ్, సేవ చేసే వ్యక్తికి మధ్య ఎన్నికలు జరిగితే.. సేవ చేసే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. సర్వీస్ అనేదే మోదీ విజయానికి కారణమని చెప్పారు.