Asianet News TeluguAsianet News Telugu

పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వివాహేతర బంధం.. కట్టుకున్నవాడిని హత్యమొందించేందుకు ప్రియుడితో కలిసి దాడి..  

వివాహేతర సంబంధం పచ్చటి సంసారాన్ని చిదిమి వేసింది.  తన భార్య మరో మరో వ్యక్తితో  వివాహేతరసంబంధం పెట్టుకుందని భర్త మందలించాడు. దీంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ చేసింది. కట్టుకున్న మొగుడుపై ..  ప్రియుడితో కలిసి కత్తితో దాడి చేసింది. అనుకున్నవిధంగా ప్లాన్ వర్క్ అవుట్ కాకపోవడంతో ఆ అమాయకుడు తీవ్రగాయాలతో వారి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని ఆవడిలో చేసుకుంది. 

Attack with boyfriend to kill the one who tied him up..
Author
First Published Nov 24, 2022, 12:56 PM IST

వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది. భార్య మరో మరో వ్యక్తితో  వివాహేతరసంబంధం పెట్టుకుందని భర్త మందలించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ భార్య.. తన ప్రియుడితో కలిసి హత్యమొందించాలని ప్లాన్ చేసింది. కానీ.. అనుకున్న విధంగా ప్లాన్ వర్క్ అవుట్ కాకపోయే సరికి.. చివరి నిమిషంలో తీవ్రగాయాలతో వారి నుంచి బయటపడ్డాడు ఆ భర్త. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని ఆవడిలో చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….చెన్నై ఆవడిలో పట్టాభిరామ్‌ సత్రం కరుమారి అమ్మన్‌ ఆలయ వీధిలో కార్తీక్‌ (35), ఇతని భార్య ఇలాకియా (30) కలిసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కార్తీక్ అదేప్రాంతంలో  చికెన్‌ సెంటర్ లో  పనిచేస్తుండగా.. అతని భార్య ఇలాకియా.. అంబత్తూరులోని ఓ ఎక్స్‌పోర్టు కంపెనీలో పని చేస్తోంది.  అయితే.. ఆమె పని చేసే కంపెనీలో  పనిచేస్తున్న శ్రీనివాసన్‌ (32)తో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు కలిసి తిరగడం. జల్సాగా గడపడం. అప్పుడప్పుడూ శ్రీనివాసన్ .. కార్తీక్ ఇంటికి వచ్చి పోవడం చేసేవాడు.

వీరి వ్యవహరం తెలుసుకున్న కార్తీక్‌ తన భార్యను మందలించాడు. అలాంటి చేష్టాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తన భర్తను అడ్డు తప్పించాలని తన ప్రియుడు శ్రీనివాసన్‌తో కలిసి స్కెచ్ వేసింది. పథకం ప్రకారం.. సోమవారం ఇంటల్లో ఉన్న కార్తీక్‌పై శ్రీనివాసన్, ఇలాకియా కలిసి దాడి చేశారు. కత్తితో హతమొందించాలని ప్రయత్నించారు. వారి దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. అతని పరిస్థితి చూసి.. స్థానికులు కార్తీక్‌ను వెంటనే ఆవడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి దాడిలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ కేసులో అతని ఇలక్యను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీనివాసన్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios