Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. గ‌ర్భిణీ అత్యాచార బాధితురాలిని స‌జీవద‌హ‌నం చేసిన నిందితుడి త‌ల్లి.. ఎక్క‌డంటే ?

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. గర్భిణీ అయిన అత్యాచార బాధితురాలని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకెళ్లిని నిందితుడి తల్లి.. తన కుటుంబ సభ్యుల సాయంతో ఆమెను సజీవదహనం చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

Atrocious.. The mother of the accused who cremated the pregnant rape victim alive.. The incident in Mainpuri, UP
Author
First Published Oct 9, 2022, 4:47 PM IST

ఓ బాలిక‌పై యువ‌కుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడ్డు. బాధితురాలు ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు. అయితే కొంత కాలం త‌రువాత బాలిక గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో ఆ గ్రామంలో పంచాయ‌తీ పెట్టారు. దీంతో గ్రామ‌పెద్ద‌లు గుట్టు చ‌ప్పుడు కాకుండా బాలిక‌ను నిందితుడు పెళ్లి చేసుకోవాల‌ని సూచించారు. దీనికి ఒప్పుకున్న నిందితుడు కుటుంబం బాలిక‌ను త‌మ ఇంటికి తీసుకెళ్లింది. అక్క‌డ నిందితుడి త‌ల్లి బాలిక‌ను స‌జీవ ద‌హ‌నం చేసింది. 

భార‌త్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కొత్త అవ‌తారంలో క‌నిపిస్తారు - దిగ్విజయ్ సింగ్

ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి త‌ల్లి, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మెయిన్‌పురి జిల్లాలో కురవలి పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని ఓ గ్రామంలో అభిషేక్ అనే యువ‌కుడు ఓ బాలిక‌పై మూడు నెల‌ల కింద‌ట అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న స‌మ‌యంలో నిందితుడు లోప‌లికి ప్ర‌వేశించి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. అయితే ఆమె భ‌యంతో ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు. 

కొంత కాలం త‌రువాత బాధితురాలికి క‌డుపులో నొప్పి వ‌చ్చింది. దీంతో త‌ల్లి ఆమెను డాక్ట‌ర్ దగ్గ‌ర‌కు తీసుకెళ్లింది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు బాలిక గ‌ర్భంతో ఉంద‌ని తేల్చారు. దీంతో ఏం జ‌రిగింద‌ని బాధితురాలిని త‌ల్లి ప్ర‌శ్నించింది. త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు త‌ల్లికి తెలియ‌జేసింది.

నవీ ముంబైలోని పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఇంజనీర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

ఈ విష‌యం త‌ల్లి గ్రామ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామ పెద్ద‌లు ఇరు కుటుంబాల‌ను పిలిపించి పంచాయ‌తీ ఏర్పాటు చేశారు. బాధితురాలిని పెళ్లి చేసుకోవాల‌ని నిందితుడికి చెప్పారు. ఈ తీర్పును ఇరు కుటుంబాలు అంగీక‌రించాయి. దీంతో నిందితుడి త‌ల్లి అక్టోబర్ 6వ తేదీన బాలిక‌ను త‌న వెంట తీసుకెళ్లింది. అదే రోజు రాత్రి త‌న కుటుంబ స‌భ్యుల సాయంతో బాలిక‌కు నిప్పంటించింది. దీంతో బాలిక శ‌రీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

రూ. 300 కోట్ల లంచం ఆఫ‌ర్.. ఈ కేసులో మాజీ గ‌వ‌ర్న‌ర్ సత్యపాల్ మాలిక్ ను సీబీఐ ఎందుకు ప్రశ్నించిందో తెలుసా?

వెంట‌నే బాధితురాలిని మెయిన్ పురి హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను సైఫాయిలోని హాస్పిట‌ల్ లో చేర్చారు. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడితో పాటు అతడి ముగ్గురు కుటుంబసభ్యులపై 307, 376, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల‌ను త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తామ‌ని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios