ఎన్ని రోజులు వెంట పడినా తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కదులుతున్న రైలు ముందుకు యువతిని తోసేశాడు. దీంతో ఆమె చనిపోయింది. ఆ యువతి చనిపోయిన వార్త వినడంతో ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయ్యింది. కాలేజీకి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూసిన తండ్రి.. బిడ్డ మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నింపింది.
పోలీస్ స్టేషన్ ముందే బీజేపీ కార్పొరేటర్ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు..
వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని ఆదంబాక్కం ప్రాంతానికి చెందిన మాణికం, తల్లి రామలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. రామలక్ష్మి అదే ప్రాంతంలోని పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఈ దంపతులకు సత్య అనే కూతురు ఉంది. ఆమె టీ నగర్ లోని జైన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నారు.
అయితే అదే సిటీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకామ్ సెకెండ్ ఇయర్ చదువుతున్న సతీష్ అనే యువకుడు కొంత కాలంగా సత్య వెంట పడుతున్నాడు. ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఈ విషయం ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు అతడిపై కొన్ని వారాల కిందట మాంబలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
శత్రువులతో వీరోచితంగా పోరాడిన ఇండియన్ ఆర్మీ డాగ్ ‘జూమ్’ ఇక లేదు..
ఈ క్రమంలో సత్య తన కాలేజీకి వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రైలు ప్రయాణం కోసం సెయింట్ థామస్ మౌంట్ సబర్బన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అక్కడికి సతీష్ చేరుకున్నాడు.
ఇద్దరు కొంత సమయం మాట్లాడుకున్న తరువాత వాగ్వాదం మొదలైంది. దీంతో కోపం తెచ్చుకున్న సతీష్ ఆవేశంతో సత్యను కదులుతున్న రైలు ముందుకు నెట్టాడు. దీంతో ఆమెపై ఒక్క సారిగా ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడున్న ఇతర ప్రయాణికులు స్పందించేలోపే ట్రైన్ వేగంగా కదిలిపోయింది. ట్రైన్ వెళ్లిన వెంటనే బాధితురాలి తల ముక్కలు ముక్కలుగా ట్రాక్ పై శవమై కనిపించింది.
ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు...వెంటనే విడుదలకు ఆదేశాలు..
వెంటనే రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు సతీష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు వారి నుంచి తప్పించుకొని పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. తరువా ఎట్టకేలకు పట్టుకున్నారు. కాగా.. కూతురు ఇలా ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయ్యిందని తెలుసుకున్న తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. ఆమె మరణవార్త వినగానే మాణిక్యం గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.
