36 ఏళ్లుగా బంధీగా ఉన్న ఓ మహిళకు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు విముక్తి కల్పించారు. 17  ఏళ్ల వయస్సులో ఓ గదిలోకి వెళ్లిన బాధితురాలు తన 53 ఏళ్ల వయస్సులో బయటకు వచ్చారు. 

ఓ తండ్రి త‌న కూతురును 36 ఏళ్లుగా ఇంట్లోనే బంధీగా ఉంచారు. ఇప్పుడు ఆమెకు 53 సంవ‌త్స‌రాలు. ఆమె త‌న జీవితంలోని చాలా ముఖ్య‌మైన స‌మ‌యం క‌నీసం సూర్య‌ర‌శ్మి, స్వ‌చ్ఛ‌మైన పొంద‌కుండానే గ‌డిపేసింది. ఈ విష‌యం తెలుసుకున్న మాజీ మేయ‌ర్, స్థానిక ఎమ్మెల్యే, ఓ ఎన్జీవో క‌లిసి ఆమెకు విముక్తి క‌ల్పించారు. 

న్యూఢిల్లీలో కాల్పుల కలకలం: షోరూమ్ వెలుపల గాల్లోకి కాల్పులకు దిగిన దుండగుడు

వివ‌రాల ఇలా ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్ (53)కు మాన‌సిక ఆరోగ్యం స‌రిగా ఉండ‌దు అనే కార‌ణంతో 36 ఏళ్ల కింద‌ట బంధీగా మారింది. ఆమెను తండ్రి ఓ గ‌దిలో గొలుసుల‌తో బంధించి ఉంచారు. బాధితురాలికి అప్పుడు 17 ఏళ్ల వ‌య‌స్సు మాత్ర‌మే ఉంది. అప్ప‌టి నుంచి ఆమెకు ఆ కుటుంబ స‌భ్యులు త‌లుపు కింది నుంచి భోజ‌నం పంపించేవారు. అలా తింటూనే ఆమె కాలం వెల్ల‌దీసేది. ఆ గ‌దిలోనే మ‌ల మూత్ర విస‌ర్జ‌న కూడా చేసేది.

కిటికిలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. 36 ఏళ్లు ఇలాగే గ‌డిచిపోయాయి. అప్ప‌టి నుంచి ఆమె త‌న గ‌దిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌పంచాన్ని చూడ‌లేదు. కాగా.. సప్నా తండ్రి గిరీష్ చంద్ ఇటీవల మరణించారు. ఆ స‌మ‌యంలో స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు. అక్క‌డ బాధితురాలి ప‌రిస్థితిని చూసి చ‌లించిపోయారు. ఆమె చుట్టూ మురికి పేరుక‌పోయి ఉంది. దీంతో సేవా సంస్థ‌లోని మ‌హిళా బృందం ఆమెకు స్నానం చేయించారు. కొత్త బ‌ట్ట‌లు అందించారు.

2024 నాటికి యూపీ రోడ్లను అమెరికాతో స‌మానంగా తీర్చిదిద్దుతాం - సీఎం యోగికి నితిన్ గడ్కరీ హామీ

బాధితురాలి ప‌రిస్థితిని ఆగ్రా మాజీ మేయర్, హత్రాస్క్ చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహౌర్ కు తెలియ‌జేశారు. దీంతో వారు అధికారుల‌తో క‌లిసి వ‌చ్చి ఆమెకు విముక్తి క‌ల్పించారు. అనంత‌రం స్వ‌ప్నాను వైద్య చికిత్స కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు.

ఈ విష‌యంపై సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలా సింగ్ మాట్లాడుతూ.. ‘‘ మేము బాధితురాలిని చూసినప్పుడు ఆమె చాలా ఘోర‌మైన ప‌రిస్థితిలో ఉంది. మా ఎన్జీవో సభ్యులు ఆమెకు స్నానం చేయించి, శుభ్రమైన బట్టలు అందించారు. అనంత‌రం ఎమ్మెల్యే మౌహర్ సప్నా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్క‌డ ఆమెను డాక్ట‌ర్లు పరీక్షిస్తున్నారు. కొన్ని వారాల్లో ఆమె బాగుపడుతుందని ఆశిస్తున్నాం ’’ అని ఆయన అన్నారు.

మేము ఎక్కువ‌ కండోమ్‌లను ఉపయోగిస్తున్నాం

కాగా.. దీనిపై వ్యాఖ్యానించడానికి ఆమె కుటుంబం నిరాకరించింది. అయితే సప్నా పరిస్థితి తమకు తెలుసని, ఆమెను ఒక డాక్టర్ కు చూపించాలని కుటుంబ సభ్యులకు పదేపదే చెప్పామని బాధితురాలు ఇరుగుపొరుగువారు తెలియజేశారు. కానీ వారు వినలేదని పేర్కొన్నారు. తమ కుటుంబ విషయాలకు దూరంగా ఉండాలని చెప్పేవారని అన్నారు.