Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. త‌క్కువ కులం వ్య‌క్తిని ప్రేమించింద‌ని కూతురిని చంపి, మృత‌దేహాన్ని కాల్చేసిన రైతు..

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కూతురు తక్కువ కులం యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించిన ఆ రైతు ఆమెను గొంతు నులుమి హత్య చేశాడు. అనంతరం శవాన్ని పొలంలోనే కాల్చేశాడు.

Atrocious.. The farmer who killed his daughter and burnt her dead body for loving a low caste person..
Author
First Published Sep 12, 2022, 9:13 AM IST

భార‌త‌దేశానికి స్వ‌తంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్నా.. స‌మాజంలో ఇంకా కుల‌, మ‌త అనే సంకుచిత భావ‌న‌లు పోవ‌డం లేదు. టెక్నాల‌జీ ఎంతో పెరిగి క్ష‌ణాల్లో స‌మాచారం అర‌చేతిలో ఉంటున్నా స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్న ఇలాంటి విష‌యాల్లో ఇంకా వెనుకంజ‌లోనే ఉన్నాం. కులం, మ‌తం పేరుతో ఇప్ప‌టికీ గొడ‌వ‌లు, హ‌త్య‌లు, విధ్వంసాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా యూపీలో ఓ రైతు కూడా ఇలాంటి దారుణానికే ఒడిగ‌ట్టాడు. త‌న కూతురు త‌క్కువ కులం వ్య‌క్తిని ప్రేమించింద‌ని ఆగ్ర‌హించిన ఆ రైతు ఆమెను అంతం చేశాడు. అనంత‌రం త‌న‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్టు ఇంటికి వ‌చ్చేశాడు. 

ఆచారాల పేరిట మహిళపై అత్యాచారం.. దొంగ బాబాను అరెస్టు చేసిన పోలీసులు

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. యూపీలోని షామ్లీలోని గ్రామంలో 56 ఏళ్ల ప్ర‌మోద్ కుమార్ వ్య‌వ‌సాయం చేస్తుంటారు. ఆయ‌న ఉన్న‌త కులానికి చెందిన వ్య‌క్తి. అత‌డికి 18 ఏళ్ల కూతురు కాజ‌ల్ ఉంది. ఆమె వెన‌క‌బ‌డిన కులానికి చెందిన యువకుడు అజయ్ కశ్యప్ (20)ను ప్రేమించింది. వీరి ఇద్ద‌రి మ‌ధ్య కొన‌సాగుతున్న ప్రేమ వ్య‌వ‌హారం తండ్రికి తెలిసింది. 

దక్షిణాఫ్రికా నుంచి 25 చిరుత పులులను తీసుకురాబోతున్న ప్రభుత్వం

ఈ విష‌యంలో తండ్రి కూతురును హెచ్చ‌రించారు. ఆ యువ‌కుడితో స‌న్నిహితంగా ఉండ‌కూడ‌ద‌ని, ప్రేమ వ్య‌వ‌హారాన్ని ముగించాల‌ని ప్ర‌మోద్ కుమార్ కాజ‌ల్ కు సూచించాడు. కానీ తండ్రి మాట‌ను కూతురు వినిపించుకోలేదు. త‌క్కువ కులం వ్య‌క్తితో సంబంధాలు అన్ని తెంచుకోవాల‌ని ప‌లు మార్లు చెప్పినా ఆమె ప‌ట్టించుకోలేదు. దీంతో స‌మాజంలో త‌న ప‌రువు పోతుంద‌ని భావించిన తండ్రి కూతురును అంతం చేయాల‌ని భావించాడు. 

అయితే ఇటీవ‌ల కూతురు కాజ‌ల్ ఇంట్లో చెప్ప‌కుండా అజయ్ కశ్యప్ తో బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఒక రోజు త‌రువాత త‌న ఇంటికి తిరిగి వ‌చ్చింది. స‌మాజంలో ఎక్క‌డ త‌న ప‌రువుకు భంగం క‌లుగుతుంద‌ని ఆందోళ‌న చెందిన ప్ర‌మోద్ కుమార్ బిడ్డ‌ను చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన రాత్రి ఏదో ప‌ని ఉంద‌ని కూతురును పొలానికి తీసుకెళ్లాడు. అక్క‌డే ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంత‌రం ఆమె మృత‌దేహాన్నితగులబెట్టాడు. 

వీల్ చైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తున్న యువతి.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

అనంత‌రం ఇంటికి తిరిగి వ‌చ్చాడు. కూతురును పానిప‌ట్ లో ఉన్న సోదరుడి ఇంట్లో విడిచిపెట్టి వ‌చ్చాన‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశాడు. అయితే మ‌రుస‌టి రోజు పొలంలో మృత‌దేహం కాల్చి ఉంద‌ని పోలీసుల‌కు స్థానికులు స‌మాచారం అందించారు. దీంతో వారు అక్క‌డికి చేరుకున్నారు. బూడిద నుంచి ఎముక‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల‌ను అక్క‌డికి పిలిపించారు. అయితే ఈ నేరంపై తండ్రి ప్ర‌మోద్ కుమార్ ను విచారించ‌గా.. తానే కూతురును హ‌త్య చేశాడ‌ని ఒప్పుకున్నాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందితుడిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఝిఝానా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో పంకజ్ త్యాగి తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios