Asianet News TeluguAsianet News Telugu

వీల్ చైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తున్న యువతి.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

దివ్యాంగురాలైన ఓ యువతి వీల్ చైర్ ఆధారంగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దివ్యాంగురాలై ఉండి ఒక మహిళ సాహసోపేతంగా జీవితాన్ని ఎదుర్కొంటున్నదని యూజర్లు ట్వీట్లు చేశారు.

specially abled delhi woman delivers food by wheel chair scooter
Author
First Published Sep 12, 2022, 3:11 AM IST

న్యూఢిల్లీ: ఓ ఇన్‌స్పైరింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వ్యక్తిగత లోపాలు అన్నీ పక్కనపెట్టి.. జీవితాన్ని ఎదుర్కొంటున్న ఓ యువతి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది. జీవిత పోరాటంలో రాజీ పడవద్దని హితం బోధిస్తున్నది. దివ్యాంగురాలైన ఓ యువతి స్విగ్గీలో వీల్ చైర్ స్కూటర్సహాయంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.  

ఆ యువతి ఫుడ్‌ను వీల్ చైర్‌లో కూర్చుని డెలివరీ చేస్తుండగా ఓ వీడియో తీశారు. ఈ వీడియోను ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ‘జీవితం నిస్సందేహంగా చాలా  కష్టమైనది. కానీ, మేం రాజీ పడం. ఆమె స్పిరిట్‌కు నేను సెల్యూట్ చేస్తున్నా’ అని ఆమె కోట్ యాడ్ చేశారు. 

కాగా, అలాంటి వీడియోనే మరొక ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. వీల్ చైర్ ఆధారంగానే ఓ దివ్యాంగురాలైన యువతి జొమాటో డెలివరీ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తున్నది.  

ఈ వీడియోలపై చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అందులో చాలా మంది సదరు యువతిని ప్రశంసల్లో ముంచెత్తారు. కాగా, ఒక యూజర్ మాత్రం కొంచెం భిన్నంగా కామెంట్ పెట్టారు. ఆ లేడీ హార్డ్ వర్క్‌కు తాను కూడా సెల్యూట్ చేస్తానని మొదటి లైన్‌లో రాశాడు. ఆ తర్వాత కానీ, ఈ వీడియో తనను ఆలోచింప చేస్తున్నదని పేర్కొన్నాడు. ఒక సమాజంగా మనం, లేదా ప్రభుత్వం వికలాంగులకు కనీస అవసరాలను సమకూర్చడంలో విఫలం అయ్యామేమో అని అనిపిస్తున్నదని వివరించాడు. అందువల్లే వారు అలాంటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తున్నదని పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios