Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. అడవికి తీసుకెళ్లి నిప్పంటించిన కుటుంబ సభ్యులు..

ఓ యువతి పట్ల ఆమె సోదరుడు, తల్లి దారుణానికి ఒడిగట్టారు. అడవికి తీసుకెళ్లి నిప్పంటించారు. పెళ్లి కాక ముందే గర్భం దాల్చిందని ఈ ఘోరానికి పాల్పడ్దారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Atrocious.. The family members took her to the forest and set her on fire because she got pregnant out of wedlock..ISR
Author
First Published Sep 29, 2023, 9:38 AM IST | Last Updated Sep 29, 2023, 9:38 AM IST

ఆ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు ఆమెను అసహ్యంగా చూశారు. గర్భం దాల్చేందుకు కారణమైన వ్యక్తి ఎవరని అడిగారు. కానీ ఆమె సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి సోదరుడు, తల్లి ఆమెను అడవికి తీసుకెళ్లి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో జరిగింది.

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులోకి చొచ్చుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం..

‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. హాపూర్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తన సోదరుడు, తల్లితో కలిసి జీవిస్తోంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ గర్భం దాల్చింది. ఈ విషయం సోదరుడు, తల్లికి తెలిసింది. ఆ యువతి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అని వారు ఆ యవతిని ప్రశ్నించారు. కానీ ఆమె వారికి సమాధానం చెప్పలేదు.

రాజస్థాన్ లోని కోటాలో మరో స్టూడెంట్ సూసైడ్.. 26కు చేరిన బలవన్మరణాలు..

అతడి గురించి ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని యువతి సోదరుడు, తల్లి తీవ్రంగా కోపోద్రిక్తులయ్యారు. ఈ విషయం తెలిస్తే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందనుకున్నారో ఏమో కానీ.. యువతిని ఆడవిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. సోదరుడు, తల్లి కలిసి యువతికి నిప్పంటించారు. తీవ్ర నొప్పితో కేకలు వేస్తున్న బాధితురాలిని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు గమనించారు.

14 ఏళ్ల బాలిక హత్య.. 3 రోజుల తరువాత ఇంటి వెనకే మృతదేహం లభ్యం.. బాబాయి చేతిలోనే హతం ?

వెంటనే ఆమెను కాపాడి, స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం బాధితురాలని మీరట్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ యువతి హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనకు కారణమైన యువతి సోదరుడు, తల్లిని పోలీసులు తమ కస్డడీలోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios