రాజస్థాన్ లోని కోటాలో మరో స్టూడెంట్ సూసైడ్.. 26కు చేరిన బలవన్మరణాలు..
రాజస్థాన్ లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టారు. గత కొంత కాలంగా ఆ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఉద్యోగాల కోచింగ్‌కు, ఉన్నత చదువులకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లోని కోటా లో స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు స్థానిక అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా అక్కడ ఈ బలవన్మరణాలు ఆగడం లేదు.
తాజాగా కూడా అక్కడ మరో ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన ఓ విద్యార్థి బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం ఈ కోటాలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. యూపీకి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఇప్పటి వరకు 26 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు లెక్కలు చెబుతున్నాయి.
Telangana Cabinet: ఇంకా జ్వరంతో బాధపడుతున్న గులాబీ బాస్.. నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా..
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.