Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. స్డూడెంట్ పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు. అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?

విద్యార్థినిపై ఓ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 

Atrocious.. Principal sexual harassment on student. The arrested police.. where?
Author
First Published Dec 24, 2022, 1:08 PM IST

అతడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి, సమాజంలో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో ఉన్నాడు. కానీ అతడి బుద్ధిగడ్డి తిన్నది. తన వద్ద చదువుకునే విద్యార్థినిపైనే కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్ లో గాలెప్ప పూజారి అనే వ్యక్తి ప్రిన్సిపాల్  (అడ్మినిస్ట్రేషన్) గా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్థిని అతడు లైంగికంగా వేధించాడు. ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. మానసికంగా వేధింపులకు గురి చేశాడు.

చైనా స‌హా మ‌రో 4 దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి.. : కేంద్రం

ఈ విషయం పోలీసులకు చేరడంతో స్థానిక ఎస్సై రాఘవేంద్ర స్కూల్ కు చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమే అని తేలింది. దీంతో ఆయన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను తయారు చేసి జిల్లా కమిషనర్ కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా డీసీ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు. నిందితుడిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ అసోసియేషన్ సీఈఓను డీసీ ఆదేశించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

కాగా.. ఇలాంటి ఘటనే నాలుగేళ్ల కిందట హైదరాబాదాలో ఒకటి చేసుకుంది. ఓ మైనర్ బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే కోర్టు అతడికి ఇటీవల జైలు శిక్ష విధించింది. ఆ టీచర్ కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2018 సంవత్సరంలో సరూర్‌నగర్‌లోని తన ఇంట్లో 15 ఏళ్ల బాలుడిని 49 ఏళ్ల ప్రైవేట్ టీచర్ పలుమార్లు లైంగికంగా వేధించాడు.

ఢిల్లీలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు. అయితే ఈ దారుణాన్ని బాలుడు తన తండ్రికి చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి సరూర్‌నగర్ పోలీసులకు 2018 జూన్ 2న ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రోజు తన కుమారుడు ట్యూషన్ కు వెళ్తుండగా టీచర్ అడ్డగించి లైంగికంగా వేధించాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 377, పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 12 కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో తీర్పు వచ్చింది. జైలు శిక్షతో పాటు 45 వేలు చెల్లించాలని కూడా ఆదేశించింది.

క్రిస్మస్ వేడుకల సందర్భంగా మతమార్పిడులు జరగకూడదు - అధికారులకు యూపీ సీఎం యోగి ఆదేశాలు

గత నెల 24వ తేదీన తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం తిరునిండ్రవూర్‌లోని ఏంజెల్‌ మెట్రిక్‌ పాఠశాలకు చెందిన కరస్పాండెంట్ వినోద్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా ఆయన 12వ తరగతి చదవే బాలికు స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధిస్తున్నాడు. టీచర్ లపై కూడా అతడు అదే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా పోయింది. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల కరస్పాండెంట్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. గంటల తరబడి ఆందోళన నిర్వహించారు. రహదారులను దిగ్బంధించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇతర అధికారులు కూడా అక్కడికి చేరుకుని విద్యార్థులతో, తల్లిదండ్రులతో మాట్లాడారు. దీంతో జరిగిన విషయం వారికి వివరించారు. నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios