రాజస్థాన్ లో దారుణం జరిగింది. మూగ, చెవిటి దళిత మహిళపై దుండగులు సామూహిక అత్యారానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా రాజస్థాన్ లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ 20 ఏళ్ల మూగ, చెవిటి దళిత యువతిపై పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదేం పామురా బాబు.. కాటేస్తుందనుకుంటే.. కాలి చెప్పుతో పారిపోయింది... !!

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ధోరిమన్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ దళిత యువతికి మాటలు రావు. అలాగే చెవులు కూడా వినిపించవు. ఆమె గురువారం సాయంత్రం మేకలు మేపేందుకు వెళ్లింది. అయితే అదే సమయంలో కారులో వచ్చిన నలుగురైదుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ (ధోరిమన్న) సుఖ్‌రామ్ విష్ణోయ్ తెలిపారు. బాధితురాలికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

ప్రియురాలితో శృంగారంలో ఉండగా గుండెపోటు.. 67యేళ్ల వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్...

ఇదిలా ఉండగా.. గత గురువారం కేరళలోని కొచ్చిలో 19 ఏళ్ల మోడల్‌పై కారులో అర్థరాత్రి సమయంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు, ఓ మహిళను ఎర్నాకులం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ సమీపంలోని పబ్‌కు వెళ్లి మద్యం తాగింది. ఓ యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి కారులో ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నయువతి అతడి మాటలను నమ్మింది. ఇంటికి వెళ్లే దారిలోనే యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.

కొచ్చి విమానాశ్రయంలో కోట్ల విలువైన బంగారం స్వాధీనం..ఇద్దరి అరెస్ట్

బాధితురాలిని ఆమె రూమ్‌మేట్‌ కలమసేరి మెడికల్ కాలేజీకు చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులు, ఓ మహిళను అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను కేరళలోని ఎర్నాకులం కోర్టు లో పోలీసులు ప్రవేశపెట్టారు. వారిని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.