Asianet News TeluguAsianet News Telugu

కొచ్చి విమానాశ్రయంలో కోట్ల విలువైన బంగారం స్వాధీనం..ఇద్దరి అరెస్ట్

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో నకిలీ పాస్‌పోర్టులు కలిగిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) గురువారం అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుల నుంచి రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.వారిద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై కస్టమ్స్‌ విచారణ కొనసాగుతోంది.

Kerala  Gold worth over Rs 2 cr seized at Kochi airport, 2 persons arrested
Author
First Published Nov 25, 2022, 11:37 AM IST

అక్రమ రవాణాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. బంగారం, డ్రగ్స్ ను వివిధ రకాలుగా తరలిస్తున్నారు. కస్టమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న  అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. స్మగ్లర్లు యధేచ్ఛగా దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్నించి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇలా అధికారుల కళ్లు కప్పి.. తప్పించుకుంటున్నారు. ఇవాళ మరోసారి కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. 

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో నకిలీ పాస్‌పోర్టులు కలిగిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) గురువారం అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుల నుంచి రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఇన్‌ఫార్మర్‌ అందించిన సమాచారం మేరకు నిందితులు సయ్యద్‌ అబుతాహిర్‌, బర్కతుల్లాలను అరెస్టు చేశారు. వారిద్దరూ తమిళనాడులోని రామనాథపురం వాసులు. వాసుదేవన్, అరుళ్ సెల్వం అనే పేర్లతో ప్రయాణిస్తూ విమానాశ్రయంలో దిగారు. విచారణ నిమిత్తం ఇద్దరినీ ఆపినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పది క్యాప్సూళ్ల రూపంలో ఉన్న బంగారాన్ని చాకచక్యంగా హ్యాండ్‌బ్యాగ్‌లో దాచుకున్నాడు. విచారణలో ముంబై విమానాశ్రయంలోని సెక్యూరిటీ హాల్‌లో శ్రీలంక జాతీయుడు హ్యాండ్‌బ్యాగ్‌ను అందజేసినట్లు ఇద్దరూ అధికారులకు చెప్పారు.

ఈ బంగారాన్ని గల్ఫ్ దేశాల నుంచి ముంబై విమానాశ్రయంలో కొందరి సహకారంతో అక్రమంగా రవాణా చేశారు. వారిద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై కస్టమ్స్‌ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంలో కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ. 38 లక్షలకు పైగా విలువైన 422 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు అండర్ వేర్ లో ప్రత్యేకంగా పాకెట్ తయారు చేసి అందులో బంగారం కుట్టించారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios