గుజరాత్ లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు చంపేసి మొండెాంను, తలను వేరు చేశారు. శరీరంపై కూడా తీవ్ర గాయాలు ఉన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుజరాత్‌లో దారుణం జరిగింది. వస్నాలోని ఓ డంప్‌యార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అయితే ఆ మృత‌దేహం ఘోరంగా త‌యార‌య్యింది. దుస్తులేమీ లేకుండా ఉన్న ఆ మృత‌దేహానికి త‌లలేదు. ఛిద్ర‌మైన మొండెం మాత్ర‌మే ఉంది. కాళ్లు కూడా న‌రికేశారు. వస్నా పోలీస్ స్టేషన్‌కు 650 మీటర్ల దూరంలోనే ఈ మృత‌దేహం క‌నిపించింద‌ని పోలీసులు తెలిపారు.

Punjab CM Bhagwant Mann: ఆస్ప‌త్రి పాలైన పంజాబ్ సీఎం.. ర‌హస్యంగా ఢిల్లీ ఆస్పత్రికి త‌ర‌లింపు..

మృతుడి వయస్సు 30 నుంచి 40 ఏళ్లు ఉంటుందని అంచనా పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఎవ‌రో గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత‌డి త‌ల‌, కాళ్లు నరికివేయడంతో అస‌లు మృతుడు ఎవ‌రినేది గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. ఈ స‌మాచారం అందుకున్న వస్నా పోలీసులు, సిటీ క్రైం బ్రాంచ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రూ. 600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన డాక్టర్ అరవింద్ గోయల్

ఈ ఘ‌ట‌న‌పై జోన్ 7 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీ భగీరథ్‌సింగ్ జడేజా మాట్లాడుతూ.. వ్యక్తిని హత్య చేసి ముక్కలు చేసి, మొండెంను మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో పడేశార‌ని చెప్పారు. ముందుగా ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ స‌హాయంతో మృతదేహం ఎవ‌రది అనే గుర్తించ‌డంపై దృష్టి పెడతామని జడేజా తెలిపారు. అయితే పోస్ట్ మార్టం ఫైన‌ల్ రిపోర్టులు వ‌చ్చిన త‌రువాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంద‌ని అన్నారు. అలాగే ఆయ‌న ఏ స‌మ‌యంలో చ‌నిపోయార‌నే సమ‌యం కూడా స్ప‌ష్టం అవుతుంద‌ని డీసీపీ వెల్ల‌డించారు.

బ్రెయిన్ లేని బీజేపీ.. రాష్ట్రప్ర‌భుత్వాల‌ను కూల్చే కుట్ర‌కు తెర‌లేపింది: మ‌మ‌తా బెన‌ర్జీ

కాగా ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ లో ఇలాంటి ఘ‌ట‌నే వెలుగులోకి వ‌చ్చింది. పటాన్‌చెరు శివార్లలోని తెల్లాపూర్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. ఆయ‌న‌ను మృత‌దేహం నుంచి త‌ల, మొండెం వేరు చేసిన దుండ‌గులు వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేసుకొని అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హత్యకు గురైన వ్యక్తిని రాజుగా గుర్తించారు. ఆయ‌న కొంత కాలం నుంచి క‌నిపించ‌కుండా పోయార‌ని కనుగొన్నారు.