Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరిన వైద్యులు తెలిపారు.
Punjab CM Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. కడుపునొప్పితో బాధపడుతున్న సీఎం మాన్ ను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాల సమాచారం. వైద్యులు పలు పరీక్షలు చేయగా ఇన్‌ఫెక్షన్ సోకినట్టు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచే ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆయనను ఢిల్లీ ఆసుపత్రిలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే త్యేక విమానంలో ఢిల్లీ తరలించినట్టు తెలుస్తోంది.
ఇటీవల సీఎం భగవంత్ మాన్ సుల్తాన్‌పూర్ లోధిలో పర్యటించిన విషయం తెలిసిందే. కాళీ బెన్ నది ప్రక్షాళన 22వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కాళీ బెన్ నదిలోని నీటిని తీసుకుని తాగారు. అనంతరం మొక్కలు నాటారు. కాళీ బెన్ నదిలోని నీటిని తాగడం వల్లే సీఎం మాన్ అనారోగ్యం పాలయ్యారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సీఎం భగవంత్ మాన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేతలు ఆకాంక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సిద్ధూ మూసావాలా హంతకుల్లో ఇద్దరు బుధవారం అమృత్‌సర్ సమీపంలో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో హతమయ్యారని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లపై ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న పోలీసులను, గ్యాంగ్‌స్టర్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను సీఎం బుధవారం అభినందించారు.
హతమైన గ్యాంగ్‌స్టర్లను జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ తర్వాత వారి నుంచి ఏకే 47, పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి విడుదల చేశారు. రాష్ట్రంలోని గ్యాంగ్‌స్టర్లు, సంఘ వ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించిందని, నిబద్ధత ప్రకారం.. పంజాబ్ పోలీసులకు భారీ బందోబస్తు లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అమృత్‌సర్‌లో గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక ఆపరేషన్‌లో కూడా విజయం సాధించింది.
పంజాబ్ సీఎం డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఇటీవల వివాహం చేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు భగవంత్ మాన్ మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో AAP 92 స్థానాలను గెలుచుకుని, దాని ప్రత్యర్థులను చాలా వరకు పక్కనపెట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. 117 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 18 స్థానాల్లో విజయం సాధించింది.
