దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు సామూహిక ఆత్మహత్య.. ఎక్కడంటే ?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యకు కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో దంపతులు, వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన పూణేలో వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది.
పూణే పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంధ్వా ప్రాంతంలోని కేశవ్ నగర్‌లో ఓ కుటుంబం దీపక్ థోటే (55), అతడి భార్య ఇందు (45), తమ 24 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ శుక్రవారం అర్ధరాత్రి వారి ఇంట్లో అందరూ శవమై కనిపించారు.
వీరంతా ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘‘ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కుటుంబానికి కొంత ఆర్థిక నష్టం జరిగింది ’’ అని చెప్పారు. అయితే విష పదార్థం సేవించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని తెలిపారు.
త్రిపురలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్-వామపక్షాల కూటమి.. సీట్ల సర్దుబాటు చర్చలు
బీహార్‌లో నవాడా జిల్లాలో గతేడాది నవంబర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగి మృతిచెందారు. చేసిన అప్పులు తీర్చలేకనే బాధిత కుటుంబం ఈ చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బాధిత కుటుంబం రాజౌలీకి చెందినదిగా గుర్తించారు. వారు నవాడాలో అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. పండ్ల వ్యాపారం చేసి జీవనం సాగిస్తుండేవారు. అయితే వారు అప్పు తీసుకున్న చోటు నుంచి గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు.
ఒడిశా అడవుల్లో శవమై కనిపించిన మిస్సింగ్ మహిళా క్రికెటర్.. కారడవిలో చెట్టుకు వేలాడుతూ..
అప్పు తీర్చాలంటూ పదే పదే ఒత్తిడి చేయడంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా తాము అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి.. విషం తాగారు. అయితే ఇది గమనించిన కొందరు వారిని ఆస్పత్రికి తరలించారు. విషం తాగిన వెంటనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతులను కేదార్‌నాథ్ గుప్తా, ఆయన భార్య అనితాదేవి, ఇద్దరు కుమార్తెలు షబ్నం కుమారి, గుడియా కుమారి, కుమారుడు ప్రిన్స్ కుమార్‌లుగా గుర్తించారు.