Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా అడవుల్లో శవమై కనిపించిన మిస్సింగ్ మహిళా క్రికెటర్.. కారడవిలో చెట్టుకు వేలాడుతూ..

ఒడిశాలో కనిపించకుండా పోయిన ఓ మహిళా క్రికెటర్ అడవిలో చెట్టుకు వేలాడుతూ శవంగా కనిపించింది. దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Missing Woman Cricketer Found Dead In Odisha Forest
Author
First Published Jan 14, 2023, 10:16 AM IST

ఒడిశా : ఒడిస్సాలో సంచలనం రేపిన మహిళా క్రికెటర్ మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన రాజశ్రీ స్వాయిన్ (26) అనే మహిళా క్రికెటర్ మృతదేహంగా లభించింది. అడవిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ టోర్నీ టీంలో ఆమెకు చోటు దక్కలేదు.  దీంతో ఆమె మానసికంగా కృంగిపోయిందని సమాచారం. దీని తర్వాతే కటక్ జిల్లా పరిధిలోని ఓ అడవి ప్రాంతంలో రాజశ్రీ ఓ చెట్టుకు వేలాడుతూ  మృతురాలుగా కనిపించింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులు కటక్ జిల్లా అథాఘడ్ ఏరియా గురుదిఝాటియా అడవుల్లోని  ఓ చెట్టుకు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అక్కడికి సమీపంలోనే పోలీసులకు ఆమె స్కూటీ కనిపించింది. అయితే ఇప్పుడు ఆమె మృతిపై అనుమానాలు చెలరేగడానికి అనేక కారణాలు ఉన్నాయి. గురుదిఝాటియా అడవులు..కారడవులు. అలాంటి అడవిలో ఆమె  ఒక్కతే ఒంటరిగా చేరుకోవడం.. అక్కడ చెట్టుకు ఎలా ఉరి వేసుకుంది.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. 

భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ మృతి.. ఆస్పత్రికి చేరుకున్న రాహుల్..

డిసిపి పినాక్ మిశ్రా దీనికి సంబంధించిన సమాచారం వెల్లడిస్తూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. రాజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని.. ఆ రిపోర్టు ఆధారంగా రాజశ్రీ మృతిపై ఓ స్పష్టతకు వస్తామని అన్నారు. రాజశ్రీ స్వాయిన్ పూరి జిల్లాకు చెందింది. ఆమె మిడిల్ ఆర్డర్ బాట్స్ ఉమెన్, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. పుదుచ్చేరిలో జరగబోయే జాతీయస్థాయి పోటీల కోసం ఒడిస్సా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ట్రైనింగ్ కు వెళ్ళింది. అయితే అక్కడ సెలక్షన్స్లో రాజశ్రీ స్వాయిన్ ఫైనల్ టీంకు సెలెక్ట్ కాలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. జనవరి 11వ తేదీన రోజు మొత్తం ఏడుస్తూనే ఉంది. 

ఆ తర్వాత ఆమె ఎవరికి కనిపించలేదు. హోటల్లో కనిపించడం లేదని తోటి క్రీడాకారిణి ఒకరు వెల్లడించారు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది.  దీంతో జనవరి 12వ తేదీన  కోచ్ పుష్పాంజలి బెనర్జీ మంగల్ బాగ్ పోలీస్ స్టేషన్లో  మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆమె మృతిపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజశ్రీ స్వాయిన్ ఒంటిపై గాయాలు ఉన్నాయని.. కంటి భాగంలో కూడా గాయాలున్నాయన్నారు. 

రాజశ్రీ స్వాయిన్ మెరుగైన ప్రదర్శన ఇచ్చినా కూడా సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను  ఒడిషా క్రికెట్ అసోసియేషన్ సీఈవో శుభ్రత్ బెహరా ఖండించారు. క్రికెటర్ రాజశ్రీ స్వాయిన్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. అన్నారు.  సెలక్షన్ ప్రక్రియ  పారదర్శకంగానే జరిగిందని తెలిపారు. ఆమెకు అవకాశం ఇవ్వకూడదని అనుకుంటే.. ముందుగానే అసలు ప్రాబబుల్ లిస్ట్ లోనే  రాజశ్రీ పేరును సెలెక్ట్ చేసేవాళ్లం కాదని ఆయన అన్నారు. ప్రాబబుల్ లిస్టులో పాతికమంది ఉన్నారని.. వారిలో నుంచి బెస్ట్ ఇచ్చిన 16 మందిని ఫైనల్ టీంకు ఒడిస్సా క్రికెట్ అసోసియేషన్ ఎంపిక  చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios