Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై మదర్సా ఉలేమా అత్యాచారం.. ఢిల్లీలో ఘటన

ఢిల్లీలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ 12 ఏళ్ల బాలుడిపై మదర్సాకు చెందిన ఉలేమా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడికి మత్తు మందు ఇచ్చి ఈ ఘటనకు ఒడిగట్టాడు. 

Atrocious.. Madrasa Ulema rapes a 12-year-old boy.. Incident in Delhi
Author
First Published Dec 15, 2022, 2:17 PM IST

2 ఏళ్ల బాలుడిపై మదర్సా ఉలేమా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని ఎండీ ఇస్రాన్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని ‘టైమ్స్ నౌ’కథనం నివేదించింది. నిందితుడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశామని ఉత్తర ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి తెలిపారు.

సైరస్ మిస్త్రీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి.. నిందితురాలు పలుమార్లు ..

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు 377, 506 కింద పోలీసులు ఎండీ ఇస్రాన్‌పై కేసు నమోదు చేశారు. అలాగే పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు 12 ఏళ్ల బాలుడిని మత్తు అందించి, అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాక చాలా సార్లు అసహజ సెక్స్‌కు పాల్పడ్డాడని డీసీపీ సాగర్ సింగ్ కల్సి చెప్పారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. 

ఇలాంటి ఘటనే జార్ఖండ్‌లో రాష్ట్రంలో మూడు రోజుల కిందట చోటు చేసుకుంది. సిమ్‌డేగా జిల్లాలోని ఓ మదర్సాకు చెందిన ఇనామ్ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ సాగుతోందని సిమ్‌డెగా పోలీసులు తెలిపారు.

లవ్ చేశాడు.. పెళ్లి చేసుకోమంటున్నదని చంపేశాడు.. 49 సార్లు కత్తితో పొడిచి దారుణ హత్య

స్థానిక మీడియా సంస్థల కథనాల ప్రకారం.. నిందితుడిని అమీనుల్లా అలియాస్ అమీన్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం జరగగా.. సోమవారం వెలుగులోకి వచ్చింది. బాలిక స్నేహితుడు ఆ మదర్సాలో చదువుకుంటూ ఉండేవాడు. ఆ బాలుడితో పాటు బాధిత బాలిక కూడా మదర్సాకు వెళ్లేది. అయితే ఎప్పటిలాగే మదర్సాకు వెళ్లిన బాలికపై ఇమామ్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ముంబాయిలోని  ఓ పాఠశాలలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై పాఠశాల ఆవరణలోనే ఇద్దరు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. ముంబ‌యిలోని మాతుంగా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. నిందితులు, బాధిత బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

ఉగ్రవాదాన్ని సమర్థించే దేశానికి నీతులు చెప్పే అర్హత లేదు.. పాక్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత్ !

మిగితా క్లాస్ మేట్స్ అంతా  డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లారు. ఈ సమయంలో తరగతి గదిలో ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (డీ), పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్లను అదుపులోకి తీసుకొని డోంగ్రి కరెక్షనల్ హోమ్ (జువెనైల్ హోమ్) కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios