తనపై అనుమానం వ్యక్తం చేస్తోందని ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని వాటర్ ట్యాంకులో దాచి, అడవిలో పరేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో దాచి పెట్టాడు. ఎవరూ లేని సమయంలో చూసి ఓ వాహనం మాట్లాడుకొని మృతదేహాన్ని అడవిలో పారేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈ సమయంలో పోలీసులకు అతడు చిక్కిపోయాడు.
త్రిపురలో కాంగ్రెస్ ముందజ.. బీబీసీ పేరుతో ఉన్న నకిలీ పోస్టు షేర్ అస్సాం కాంగ్రెస్ చీఫ్..
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర కన్నడ జిల్లా హలియాల్‌లోని తేర్గావ్ గ్రామంలో తుకారాం, శాంతకుమారి అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే తుకారం పక్కింటి మహిళతో సన్నిహతంగా మెలుగుతున్నాడని భార్య అనుమానం వ్యక్తం చేసింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే తనకు ఆమెతో ఎలాంటి సంబంధమూ లేదని తుకారం చెబుతుండేవాడు.
హైడ్రోజనే మన భవిష్యత్ ఇంధనం.. త్వరలో రైతులు దానిని ఉత్పత్తి చేస్తారు - నితిన్ గడ్కరీ
ఈ క్రమంలో తాజాగా కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన తుకారాం భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఇంటి వద్ద ఉన్న వాటర్ ట్యాంకులో దాచి పెట్టాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. మరుసటి రోజు ఉదయం నిందితుడి మరో ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకుని మృతదేహాన్ని వాటర్ ట్యాంకు నుంచి మృతదేహాన్ని బయటకు తీశాడు. ఓ వాహనంలో డెడ్ బాడీని ఉంచి, అటవీ ప్రాంతంలో దానిని పారేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో శబ్దాలు రావడంతో ఇంటి యజమాని రౌఫ్ కల్బాయి బయటకు వచ్చాడు. తుకారం తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు.
సినిమాపై ఓ తాత అభిమానం... సోషల్ మీడియాలో వైరల్..!
దీంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టెర్గావ్ గ్రామంలో ఓ ఖాళీ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ ప్రారంభించిన అనంతరం నిందితుడిని గుర్తించారు. అతడిని ప్రశ్నించడంతో భార్యను హత్య చేసినట్టు ఒప్పకున్నాడు. తరువాత మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లాడని దండేలి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివానంద్ కట్గి చెప్పారు.
ఢిల్లీలో వీధికుక్కపై అత్యాచారం.. వీడియో వైరల్..
శాంతకుమారికి ఇది రెండో పెళ్లి అని పోలీసులు తెలిపారు. నిందితుడికి సాయం చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని బెలగావి జిల్లా ఖానాపూర్ తాలూకాలోని చించ్‌వాడ్‌కు చెందిన రిజ్వాన్, అల్నవర్‌కు చెందిన సమీర్ పాంటోజీగా గుర్తించారు.
