ఈ పోస్ట్‌లో డైరీ నుండి పేజీలు, వాటి భాషలు, వారు చూసిన తేదీ చేతితో రాసి ఉన్నాయి. దాదాపు 470 సినిమాలు ఆయన చూశారట. వాటికి సంబంధించిన రికార్డులను అందులో రాయడం గమనార్హం.
సినిమా అంటే అభిమానం చాలా మందికి ఉంటుంది. ఆ అభిమానాన్ని చాలా మంది చాలా రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా.. ఓ వ్యక్తి తాను చూసిన సినిమాలకు సంబంధించి ఓరికార్డు తయారు చేయగా... దానిని ఆయన మనవడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌ను ట్విట్టర్‌లో అక్షై అనే వినియోగదారు పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో డైరీ నుండి పేజీలు, వాటి భాషలు, వారు చూసిన తేదీ చేతితో రాసి ఉన్నాయి. దాదాపు 470 సినిమాలు ఆయన చూశారట. వాటికి సంబంధించిన రికార్డులను అందులో రాయడం గమనార్హం.
అక్షై దీనిని తన తాత లెటర్‌బాక్స్డ్ వెర్షన్ అని పేర్కొనడం గమనార్హం. ఆయన తాను చూసిన ప్రతి సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా డీటైల్డ్ గా పేర్కొనడం గమనార్హం. ఆ సినిమా సాధించిన రికార్డులను కూడా ఆయన స్వయంగా చేతితో రాసుకున్నారు.
"చాలా కాలం క్రితం, నా తాత అతను చూసిన చలనచిత్రాల రికార్డును ఉంచడానికి తన స్వంత లెటర్‌బాక్స్డ్ వెర్షన్‌ను సృష్టించాడు. అతను హిచ్కాక్, జేమ్స్ బాండ్ ఫిల్మ్‌లను థియేటర్లలో చూశాడు అని నేను ఆశ్చర్యపోతున్నాను" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
