ఢిల్లీలోని హరి నగర్‌లో వీధికుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు.

ఢిల్లీ : కన్నూ, మిన్నూ తెలియనితనంతో ముష్కరులు చెలరేగిపోతున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడడంతో ఆగడం లేదు. మూగజీవాలపై కూడా తమ పశువాంఛ చూపిస్తున్నారు. నోరులేని మూగజీవాల మీద అత్యాచారాలకు పాల్పడి.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగించే విషయమే. 

ఈ క్రమంలోనే ఢిల్లీలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వీధికుక్కపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. దేశ రాజధానిలోని హరి నగర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఓ పార్కులో కుక్కపై అత్యాచారం జరిగింది. ఈ అమానుష ఘటన ఎలా వెలుగులోకివచ్చిందంటే.. 

రాత్రంతా సీబీఐ ఆఫీసులోనే మనీష్ సిసోడియా.. వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టు ముందుకు..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హరినగర్ స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తర్వాత, పోలీసులు చర్య తీసుకున్నారు భారతీయ శిక్షాస్మృతి (IPC), జంతు చట్టంలోని సెక్షన్ 377/11 కింద నిందితులపై కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గతనెలలో యానాంలో చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నా, పెద్దా మరిచి.. వయసు తారతమ్యాలు లెక్కచేయక.. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు.. చివరికి మూగజీవాలను కూడా వదలడం లేదు. మానవత్వం మరిచి, పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి మత్తు నెత్తికెక్కి.. మదంతో ఒళ్ళు కొవ్వెక్కి.. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. హృదయ విదారకమైన ఈ ఘటనలో తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోలేక.. ఆ పైశాచికత్వాన్ని తట్టుకోలేక ఆ మూగ జీవి ఊపిరి చాలించింది. బుధవారం రాత్రి యానాంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. జాతీయరహదారికి ఆనుకుని ఉన్న ఓ కొబ్బరి తోటలో ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఈ ఘటనలో మృతి చెందిన ఆవు పొగాకు ఈశ్వరరావు అనే రైతుది. కామాంధులు ఆవు నాలుగు కాళ్ళను, మెడను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత దానిమీద లైంగిక దాడికి పాల్పడ్డారు. పొగాకు ఈశ్వర రావు గురువారం ఉదయం కొబ్బరి తోటకు వెళ్లేసరికి ఆవు చనిపోయి కనిపించింది. దాని కాళ్ళకి, మెడకి తాళ్లు కట్టేసి ఉన్నాయి. అంతేకాదు ఆ చుట్టుపక్కల గంజాయి తాగిన ఆనవాళ్లు కూడా కనిపించాయి.

పదో తరగతి విద్యార్థిని పరీక్ష రాయడం కోసం గ్రీన్ కారిడార్.. ఎక్కడంటే..

వెంటనే ఈశ్వర రావు యానాం పోలీసులకు ఈ ఘటన మీద సమాచారం ఇచ్చాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని.. దీనికోసం పోలీసులు గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పుదుచ్చేరి పశు వైద్యాధికారి కదిరేశన్ ఈ ఘటన మీద మాట్లాడుతూ.. లైంగిక దాడితోపాటు.. ఊపిరాడకపోవడంతోనే ఆవు మృతి చెంది ఉంటుందని అన్నారు. మూగజీవాలతో లైంగిక చర్యలకు పాల్పడటం.. వాటికి హాని కలిగించడం చట్టరీత్య తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.