Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దారుణం.. శివుడికి న‌ర‌బ‌లి ఇవ్వాలంటూ 6 ఏళ్ల బాలుడి హ‌త్య

దేశంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మూఢ నమ్మకాలు ఇంకా పూర్తిగా తొలగిపోవడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో  ఇద్దరు వ్యక్తులు ఓ బాలుడిని హత్య చేశారు. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది. 

Atrocious in Delhi.. 6-year-old boy killed for offering human sacrifice to Lord Shiva
Author
First Published Oct 3, 2022, 11:12 AM IST

దక్షిణ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. శివుడికి న‌ర‌బ‌లి ఇవ్వాలంటూ 6 ఏళ్ల బాలుడిని ఇద్ద‌రు యువ‌కులు హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న లోధి కాలనీలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు ‘భోలే కా ప్రసాద్’ అని పిలిచే ‘గంజా’ను తాగి, చిన్నారి గొంతు కోశారు. తమ జీవితంలో మంచి జరగాలనే ఉద్దేశంతో నిందితులు బాలుడిని బలితీసుకున్నారని పోలీసులు తెలిపారు. 

హ‌లో.. వందేమాత‌రం.. మ‌హారాష్ట్రలో మ‌రో పొలిటిక‌ల్ ఫైర్..

లోధి కాలనీలోని CGO కాంప్లెక్స్‌లో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో శని, ఆదివారాల్లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. నిందితులిద్దరినీ స్థానికులు ఘటనా స్థలం నుంచి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిద్దరూ బీహార్‌కు చెందిన విజయ్‌కుమార్‌, అమర్‌కుమార్‌గా గుర్తించారు. చనిపోయిన బాలుడి తల్లిదండ్రులతో క‌లిసి వీరు నిర్మాణ స్థలంలో సిమెంట్ కట్టర్లుగా పనిచేస్తున్నారు.

ఇంకా చీక‌ట్లోనే పుదుచ్చేరి.. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం నివాసాలకూ ప‌వ‌ర్ నిలిపివేత‌..

ఈ ఘ‌ట‌న‌పై సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (DCP) చందన్ చౌదరి మాట్లాడుతూ.. “ లోధి కాలనీ పోలీస్ స్టేషన్‌లో శనివారం, ఆదివారం మధ్య రాత్రి 12.40 గంటలకు ఘటన గురించి సమాచారం అందింది. సీబీఐ భవనానికి సమీపంలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న నిర్మాణ స్థలంలో ఇద్దరు యువ‌కులు ఓ బాలుడి మెడను కోసి చంపార‌ని సమాచారం అందింది. నిందితుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ’’ అని ఆయన అన్నారు. 

మృతి చెందిన పిల్లవాడిని ధర్మేందర్‌గా పోలీసులు గుర్తించారు. బాల‌డి తండ్రి పేరు అశోక్ కుమార్. నిందుతులు ఆ ప్రాంతంలో పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ఈ క్ర‌మంలో శ‌నివారం కూడా పూజలు చేసిన అనంత‌రం గంజాయి తాగారు. న‌ర‌బ‌లి ఇవ్వాల‌ని భావించారు. త‌రువాత బాధిత బాలుడిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి గొంతు కోసి హ‌త్య చేశారు. అయితే బాలుడి క‌నిపించ‌డం లేద‌ని అత‌డి త‌ల్లిదండ్రులు వెత‌కడం ప్రారంభించారు. 

దుర్గా పూజ మండ‌పంలో అగ్నిప్రమాదం.. 12 ఏళ్ల బాలుడు మృతి, 52 మందికి గాయాలు

నిర్మాణ స్థ‌లంలో గాయంతో బాలుడి క‌నిపించ‌గా.. పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. నిందితుల‌ను కార్మికులు, CRPF సిబ్బంది సహాయంతో ప‌ట్టుకున్నారు. ఈ స‌మ‌యంలో వారు మత్తులో ఉన్నారు. నిందితులు మ‌రో ఇద్ద‌రిని బ‌లి ఇవ్వాల‌ని కోరుకున్నా.. అది సాధ్యం కాలేదు. అంత‌కు ముందే పోలీసుల‌కు చిక్కారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios