Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. అప్పు తిరిగి ఇవ్వలేదని మహిళ అవయవాలు కోసి కిరాతకంగా హత్య.. బీహార్ లో ఘటన

అప్పు తిరిగి చెల్లించలేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళపై పట్టపగలు కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. 

Atrocious.. A woman's limbs were chopped off and murdered for not returning the loan.. Incident in Bihar
Author
First Published Dec 7, 2022, 11:18 AM IST

బీహార్ లో దారుణం జరిగింది. ఓ మహిళ తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఆమెను కిరాతకంగా హత్య చేశారు. పట్టపగలు రద్దీగా ఉండే ప్రదేశంలోనే ఆమెపై దాడి చేసి చేతులు, రొమ్ము, చెవులు నరికివేశారు. దీంతో ఆమె చనిపోయింది. ఈ ఘటన భాగల్‌పూర్‌లో ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. 

ఏడేళ్ల క్రితం చనిపోయిందనుకున్న మహిళ సజీవంగా.. హత్యానేరంలో జైల్లో యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే...

వివరాలు ఇలా ఉన్నాయి. నీలమ్ అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం తన కుటుంబ సన్నిహితుడైన షకీల్ మియాన్ నుంచి డబ్బును అప్పుగా తీసుకుంది. అయితే ఆ అప్పును తిరిగి ఇవ్వలేకపోయింది. దీంతో కోపం పెంచుకున్న అతడు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన భాగల్‌పూర్‌లో పట్టపగలు పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె చేతులు, రొమ్ములు, చెవులు నరికివేశాడు. అలాగే వీపుపై దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు చూసినా ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. ఇవన్నీ క్షణకాలంలో జరిగిపోయాయి. అక్కడున్న వారికి పరిస్థితి అర్థం కాకముందే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఉత్తర ప్రదేశ్ లో దారుణం...ప్రేమవివాహం చేసుకుందని.. ఉమ్ము నాకించి..

ఈ ఘటనను పలువురు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. కొంత సమయం తరువాత ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఆమె అపస్మారస్థితిలోకి వెళ్లే ముందు తనపై దాడి చేసింది నీలమ్ అని చెప్పింది. దానిని కూడా ప్రత్యక్ష సాక్షులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. అనంతరం ఆమెను జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ హాస్పిటల్‌ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మరణించిందని ‘స్వర్ణ ప్రభాత్‌’ పేర్కొందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’నివేదించింది.

నేను నోరు విప్పితే ఒడిశా దృశ్యమే మారిపోతుంది - హనీ ట్రాప్ లో నిందితురాలు అర్చన నాగ్

ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో బలగాలను మోహరించారు. కాగా.. మృతురాలి కుటుంబం ఇద్దరు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. వారిద్దరినీ అరెస్టు చేశారు. నిందితుడు తరచూ తమ ఇంటికి వచ్చేవాడని, ఆర్థిక సమస్యలతో గొవడలు జరిగేవని బాధితురాలి భర్త పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios