Asianet News TeluguAsianet News Telugu

నేను నోరు విప్పితే ఒడిశా దృశ్యమే మారిపోతుంది - హనీ ట్రాప్ లో నిందితురాలు అర్చన నాగ్

ఒడిషాలో వెలుగు వచ్చిన హానీట్రాప్ కేసులో నిందితురాలిగా ఉన్న అర్చన నాగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడితే ఒడిశాలో పరిస్థితులు మొత్తం మారిపోతాయని చెప్పారు. అవన్నీ చెప్పేందుకు తనకు కొంత సమయం కావాలని అన్నారు. 

Odisha scene will change if I open my mouth - Accused in Honey Trap Archana Nag
Author
First Published Dec 7, 2022, 10:11 AM IST

ఒడిశాలో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిందితురాలైన అర్చన నాగ్ ను మంగళవారం ఏడు రోజుల కస్టడీకి తీసుకుంది. అయితే రిమాండ్ కు ముందు ఆమెను మెడికల్ టెస్ట్ ల కోసం ఝర్పాడ జైలు నుంచి క్యాపిటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో సంభాషించారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ, ఆప్ హోరాహోరీ..!

‘‘నేను నోరు విప్పితే ఒడిషాలో ఉన్న పరిస్థితులు మొత్తం మారిపోతాయి. అన్నీ తెలియజేసేందుకు నాకు తగిన సమయం కావాలి. దాదాపు  30 నిమిషాల సమయం నాకు కేటాయించండి. ప్రత్యేక సాక్ష్యాలు అందజేస్తాను.  నేను ఎలాగూ చిక్కుకున్నాను. ఎవరినీ విడిచిపెట్టను.’’ అని అన్నారు. ఒడియా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అక్షయ పారిజాపై లక్ష్మీసాగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసిన రోజు నుంచి శ్రద్ధాంజలి బెహెరా (ఆమె సహచరుడు) కాల్ రికార్డులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పరిశీలించాలని అర్చన కోరారు.

ఈ విషయంలో తగిన ఎంక్వైరీ జరిపి, తన తరఫున వాదనలు వినిపించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని అర్చన విలేకరులతో అన్నారు. ‘‘ఈడీ విచారణలో సహకరించేందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఎవరినీ విడిచిపెట్టను’’ అని ఆమె చెప్పారు. కేసులో ఇరుక్కున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు లబ్ధి పొందారని అర్చన ఆరోపించారు. అయితే ఆమె వరి పేరునూ చెప్పలేదు.

వధువుకి పక్షవాతం.. ఎత్తుకొనివెళ్లి మరీ పెళ్లి చేసుకున్న వరుడు...!

కాగా.. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అర్చన ఇంటి ఆర్కిటెక్ట్ రంజిత్ బెహెరా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందుకు వచ్చారు. భువనేశ్వర్‌లో ఆమె ఇంటిని కట్టిన కాంట్రాక్టర్ పబిత్ర పాత్రను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  సోమవారం పరిశీలించింది. ఒడియా సినీ ప్రొడ్యూసర్ తనపై లైంగిక వేధింపులు జరుపుతున్నాడని పేర్కొంటూ ఓ బాలిక ఫిర్యాదు చేయడంతో సంచలనం సృష్టించిన ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఫిర్యాదు తరువాత  కొన్ని ఉద్దేశపూర్వకంగా పారిజా ఒక అమ్మాయితో ఉన్న అసభ్యకరమైన చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. 

అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీకి చెందిన 20 మందికి పైగా నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు అర్చన హనీ-ట్రాప్‌లో చిక్కుకున్నారు. సంపన్న కస్టమర్‌లను సంతోషపెట్టడానికి హై-ప్రొఫైల్ కాల్ గర్ల్స్‌ను నియమించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అర్చన, ఆమె భర్త జగబంధు చంద్, వారి వ్యాపార భాగస్వామి ఖగేశ్వర్ లను పోలీసులు అరెస్టు చేశారు.

దారుణం.. భర్తతో వివాహేతర సంబంధం.. భార్యపై యాసిడ్ దాడి.. ఓ మహిళ ఘాతుకం...

అర్చనతో పాటు మరో మహిళ కూడా బెహెరా తన నుండి మూడు కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ పారిజా కూడా నాయపల్లి పోలీసులను ఆశ్రయించారు. వారికి మరో ఫిర్యాదు అందించారు. ఒడిశా అధికార పార్టీ అయిన బీజేడీ, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీకి చెందిన ఇరవై కంటే ఎక్కువ మంది నేతలు, బిజినెస్ మెన్ లు, మూవీ ప్రొడ్యూసర్ లతో పాటు మరి కొందరు కూడా  ఆమె హనీ ట్రాప్ కు గురయ్యారు. కాగా.. ఈ కేసులో అర్చన తో పాటు ఆమె భర్తను, వారి బిజినెస్ పార్టనర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios