బీహార్ లోని సీతామర్హిలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల వివాదాస్పందంగా మారిన నూపుర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో చూశాడని ఓ యువకుడిని మరో దుండగుడు కత్తి పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
నూపుర్ శర్మ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారని రాజస్థాన్ లో ఉదయపూర్ లో టైలర్, మహారాష్ట్రలోని అమరావతి వెటర్నరీ ఫార్మసిస్టు హత్య మరవకముందే బీహార్ లో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. సీతామర్హిలో ఓ యువకుడు నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూశాడని మరో వ్యక్తి అతడిని దారుణంగా కత్తితో 6 సార్లు పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సింగపూర్ వెళ్లేందుకు ఢిల్లీ సీఎం ఎందుకంత తహతహలాడుతున్నారు ? - బీజేపీ
అయితే ఆ యువకుడు చూసింది నూపుర్ శర్మకు సంబంధించిన వీడియో కాదని పోలీసులు కొట్టిపారేశారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుడి తండ్రి మనోజ్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత్ ఝా (23) అనే యువకుడు నాన్‌పూర్‌లోని బహెరా గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు పాన్ తినేందుకు పాన్ షాపుకు వెళ్లాడు. ఈ సమయంలో అంకిత్ ఝా తన మొబైల్‌లో నుపుర్ శర్మ వీడియోను చూస్తున్నాడు. అక్కడకు అదే గ్రామానికి చెందిన మహమ్మద్ బిలాల్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చాడు. యువకుడు వీడియో చూడటం అతడికి నచ్చలేదు.
అరుణాచల్ ప్రదేశ్ లో 19 మంది కార్మికులు అదృశ్యం: ఒకరి డెడ్ బాడీ గుర్తింపు
దీంతో అతడు అంకిత్ ముఖంపై సిగరెట్ పొగను ఊదడం ప్రారంభించాడు. అనంతరం దుర్భాషలాటడం మొదలు పెట్టారు. అనంతరం అంకిత్ నడముపై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. దాడి సమయంలో బాధితుడు పరిగెత్తడం, అనంతరం రక్తస్రావం జరుగుతుండగా కింద పడిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. స్థానికులు వెంటనే అప్రమత్తం అయి క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించారు. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది.
‘మీలాగా చేస్తే నేనూ ముఖ్యమంత్రినవుతానా?’.. ఏక్ నాథ్ షిండేకు చిన్నారి ప్రశ్న.. నెట్టింట వైరల్..
ఈ ఘటనపై మనోజ్ ఝా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సీతామర్హి దాడి ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసుల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాడికి సంబంధించి నూపుర్ శర్మ కేసు గురించి మొదటి ఫిర్యాదులో పేర్కొన్నారని, అయితే తరువాత దానిని మార్చాలని పోలీసులు కోరారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని ‘జీ న్యూస్’ కథనం పేర్కొంది. రెండో ఫిర్యాదులో నుపుర్ శర్మ పేరును తొలగించి ఎఫ్ఐఆర్ నమోదైంది. నూపూర్ శర్మ వీడియోను చూసి ఇతర మతాలకు చెందిన యువకులు అతడిపై దాడి చేశారని అంకిత్ కుటుంబం ఆరోపించింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
