మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ చిన్నారి షిండేను ‘మీలాగా చేస్తే నేనూ ముఖ్యమంత్రినవుతానా?’ అని ప్రశ్నించింది.
మహారాష్ట్ర : మహారాష్ట్ర ముఖ్యమంత్రి Eknath Shindeకు ఓ చిన్నారితో సరదా సమయం గడిపారు. ముంబైలోని అతని నందనవన్ బంగ్లాలో ముఖ్యమంత్రికి ఒక అమ్మాయికి మధ్య జరిగిన పరస్పర
సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం social mediaలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలు ఆ అమ్మాయి ముఖ్యమంత్రి ఎలా కావాలో సలహా ఏక్ నాథ్ షిండేను సలహా అడుగుతుంది.
ఆ వీడియోలోని అన్నదా దామ్రే అనే అమ్మాయి వరద బాధిత ప్రజలకు "అతను చేసినట్లు" సహాయం చేస్తే.. తాను కూడా ముఖ్యమంత్రిని కాగలనా? అని అడిగింది. అస్సాంలో వరదలు వచ్చినప్పుడు మీరు ప్రజలను ఆదుకునేందుకు నీళ్లల్లోకి వెళ్లారు కదా.., వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను కూడా ముఖ్యమంత్రిని కాగలనా? అని ఆమె ప్రశ్నించింది.
Kerala NEET Exam Row : విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై పోలీస్ కేసు, త్వరలో అరెస్టులు..
దీంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆమె ప్రశ్నకు నవ్వుతూ, "అవును, అలా చేస్తే నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతావు. దీనిపై మేం తీర్మానం కూడా చేస్తాం" అని అన్నారు. అంతేకాదు.. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా తనను గౌహతికి తీసుకువెళతానని హామీ ఇవ్వమని అన్నాడా ముఖ్యమంత్రి షిండేని కోరింది. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ "తప్పకుండా, నిన్ను తీసుకువెడతాను. గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని చూడాలనుకుంటున్నావా?" అని షిండే ప్రశ్నించారు. దీనికి ఆ చిన్నారి అవును అంటూ సమాధానం ఇచ్చింది.
ఆ సంభాషణ తరువాత షిండే తన గదిలోని తన సహాయకుల వైపు తిరిగి, "అమ్మాయి చాలా తెలివైనది" అని వ్యాఖ్యానించాడు. గత నెలలో, మహారాష్ట్ర శాసనసభలో ఏక్నాథ్ షిండే 39 మంది శివసేన సభ్యులతో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు, చివరికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పదవీ విరమణ చేయవలసి వచ్చింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శిబిరం జూన్ 22న గౌహతికి చేరుకుంది. ఎనిమిది రోజుల తరువాత, షిండే, అతని డిప్యూటీ, బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు.
