Asianet News TeluguAsianet News Telugu

Assam floods : అస్సాంలో కొన‌సాగుతున్న వ‌ర‌ద విధ్వంసం.. విరిగిప‌డ్డ కొండచ‌రియ‌లు.. ముగ్గురు మృతి

అస్సాం రాష్ఠ్రంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. రోడ్లు విధ్వంసం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు చనిపోయారు. 

Assam floods: Destruction of Assam continues .. Broken landslides .. Three killed
Author
Guwahati, First Published May 16, 2022, 11:35 AM IST

అస్సాం రాష్ట్రంలో వ‌రద విధ్వంసం కొన‌సాగుతోంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రోజుల కింద‌ట వ‌ర‌ద‌లు రాష్ట్రాన్ని ముంచెత్త‌డం ప్రారంభించాయి. ఆదివారం కూడా అస్సాంలో ఇలాంటి ప‌రిస్థితే క‌నిపించింది. అధిక వ‌ర్షాల వ‌ల్ల కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. సుమారు 57 వేల మంది ప్రభావితమయ్యారు. ముగ్గురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు.ఈ మూడు మ‌ర‌ణాలు కూడా కచార్ ఒక జిల్లాలోనే జ‌ర‌గ‌డం విచార‌క‌రం. ప్ర‌స్తుత వ‌ర‌ద‌ల వ‌ల్ల ముఖ్యంగా కచార్, ధేమాజీ, హోజాయ్, కర్బి ఆంగ్లాంగ్ వెస్ట్, కామరూప్ (ఎం), నాగావ్, నల్బరి ప్రాంతాలు ప్ర‌భావానికి గుర‌వుతున్నాయి. 

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 222 గ్రామాలు ప్రభావితమయ్యాయి. కాచర్ లో 138 గ్రామాలు, ధేమాజీ లో 2 గ్రామాలు, హోజై 34, కర్బి ఆంగ్లాంగ్ వెస్ట్ 5, నాగావ్ లో 39, నల్బరిలో 4 గ్రామాలు ముంపున‌కు గుర‌య్యాయి. ఈ గ్రామాల్లో నివసించే బాధిత ప్రజలకు సహాయం చేయడానికి, అస్సాం ప్రభుత్వం సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిమీద దారుణమైన దాడి.. చోద్యం చూస్తున్న జనం.. వీడియో వైరల్...

ASDMA విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం 10321.44 హెక్టార్ల సాగు భూమి వరద నీటిలో మునిగిపోయింది. న్యూ కున్‌జుంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయి, నమ్‌జురాంగ్, సౌత్ బాగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్ మరియు లోడి పాంగ్‌మౌల్ గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడటంతో జతింగా-హరంగాజావో, మహుర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ బ్లాక్ అయినట్లు ASDMA పేర్కొంది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగాన్ని కలిపే రహదారి కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అందించేందుకు ప్ర‌భుత్వం ఇండియ‌న్ ఆర్మీ, పారామిలటరీ దళాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు శిక్షణ పొందిన వాలంటీర్లను నియ‌మించింది. కచార్, ధేమాజీ, మోరిగావ్ కరీంగంజ్, నాగావ్ జిల్లాలకు ఏఎస్డీఎంఏ వరద హెచ్చరికలు జారీ చేసింది. రెండు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 10 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాల్లో కనీసం 227 మంది ఆశ్రయం పొందుతున్నారు.

పెదాలపై ముద్దుపెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకడం... అసహజ లైంగిక నేరం కాదు : బాంబే హైకోర్టు

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం .. 4,330 మంది ఖైదీలు సహాయక శిబిరాల్లో ఉంటున్నారు. హఫ్లాంగ్ - హోకై పుంగ్చి, లోయర్ హఫ్లాంగ్, బెథానీ, న్యూ కుంజంగ్, హైలకండి, దిస్పూర్, హతిగావ్, కెరైకుచి, నల్బరిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు వెలుగు చూశాయి.  అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కింలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మేఘాలయలో నేడు, రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios