Asianet News TeluguAsianet News Telugu

పెదాలపై ముద్దుపెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకడం... అసహజ లైంగిక నేరం కాదు : బాంబే హైకోర్టు

పోక్సో చట్టం, సెక్షన్ 377కింద అరెస్టైన ఓ వ్యక్తికి బెయిల్ ఇస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెదాలపై ముద్దుపెట్టడం అసహజ లైంగిక నేరం కాదు అని చెప్పుకొచ్చింది. 

Kissing on the lips, touching private parts is not an unnatural sexual offence : Bombay High Court
Author
Hyderabad, First Published May 16, 2022, 7:50 AM IST

ముంబై :  లైంగిక నేరాలకు సంబంధించి Bombay High Court ఆసక్తికర తీర్పు వెలువరించింది.  పెదాలపై kissing చేయడం… శరీరంలోని ప్రైవేట్ భాగాలను స్పృశించడం భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ కింద  అసహజ లైంగిక నేరాలు కావనిపేర్కొంటూ ఓ వ్యక్తికి bail మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఓ 14 ఏళ్ల బాలుడికి నిందితుడు ముద్దు పెట్టడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాగడం అనేది కేసులో ప్రధాన అభియోగం. బాలుడి తండ్రి ఫిర్యాదు మీద పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, ఐపిసి 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 377 ప్రకారం గరిష్ట శిక్ష.. జీవిత ఖైదు. ఈ సెక్షన్ కింద బెయిల్ లభించడం కష్టం. 

జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్ తన బెయిల్ ఉత్తర్వుల్లో.. లైంగిక దాడి జరిగిందన్న బాలుడి ఆరోపణలను.. వైద్య పరీక్షలు ధృవీకరించడం లేదని పేర్కొన్నారు. Pocso చట్టంకింద  బనాయించిన సెక్షన్ల ప్రకారం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఐదేళ్ల గరిష్ట శిక్ష మాత్రమే పడుతుందని.. కాబట్టి నిందితుడు బెయిల్కు అర్హుడని తెలిపారు. ఈ కేసులో అసహజ శృంగారం వర్తించదని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్ఐఆర్  ప్రకారం... బాధితుడి ప్రైవేట్ భాగాలను నిందితుడు తాకాడని, పెదాలపై ముద్దు పెట్టాడు అని అర్థమవుతుంది. కానీ నా దృష్టిలో ఇది ప్రాధమికంగా.. 377 సెక్షన్ కింద నేరాలు కాదు. పైగా నిందితుడు ఏడాదిగా కస్టడీలో ఉన్నాడు.  విచారణ కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రూ. 30వేల పూచీకత్తు కట్టాలని నిందితుడిని ఆదేశించారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 17న కోల్ కతా హైకోర్టు మైన‌ర్ బాలిక‌ల లైంగిక వేధింపుల విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. లైంగిక ఉద్దేశంతో బాధితురాలి ఛాతీని లేదా నిర్థిష్ట భాగాల‌ను తాకితే.. అది లైంగిక వేధింపుల కింద‌కు వ‌స్తుంద‌ని కోల్‌క‌తా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి శరీరంలో ఛాతి అభివృద్ధి చెందిందా..? లేదా..? అనేది అప్రస్తుతమని, నిందితుడు దురుద్దేశంతో తాకితే లైంగిక వేధింపులుగా ప‌రిగ‌ణించాల‌ని స్ప‌ష్టం చేసింది. 2017లో నమోదైన ఓ కేసుకు సంబంధించి కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 448ల ప్రకారం నిందితుడు దోషి అని నిర్థారించించింది. 

2017లో నమోదైన కేసు ప్రకారం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రోహిత్ పాల్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఓ బాలిక(13)ను లైంగికంగా వేధించాడు. ఇంట్లో ఆడుకుంటున్న బాలికను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ఛాతితో పాటు ఇతర శరీర భాగాలను తాకుతూ, ఆమె ముఖం మీద ముద్దులు పెట్టాడు. దీంతో ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 448ల ప్రకారం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios