Asianet News TeluguAsianet News Telugu

అర్పిత ప్రాణాలకు ముప్పు ఉంది.. జైల్లో ఆహారం, నీరు తనిఖీ చేయండి - ఈడీ త‌రుఫు న్యాయ‌వాది

అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉందన్న వాదనను ఈడీ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఆమెకు జైలులో అందే ఆహారాన్ని, నీటిని క్షుణ్ణంగా పరీక్షించాలని అధికారులను కోరారు. 

Arpitas life is under threat.. Check food, water in jail - Advocate for ED
Author
Kolkata, First Published Aug 6, 2022, 11:40 AM IST

పశ్చిమ బెంగాల్ లో టీచ‌ర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ప్ర‌ధాన నిందితుడైన పార్థ చ‌ట‌ర్జీకి స‌న్నిహితురాలిగా ఉన్న అర్పితా ముఖ‌ర్జీకి జైల్లో ప్రాణ‌హాని ఉంద‌ని ఆమె త‌రుఫు న్యాయవాధి కోర్టులో విన్న‌వించారు. ఆమెను న‌లుగురు కంటే ఎక్కువ మంది ఖైదీల‌తో ఉంచ‌రాద‌ని చెప్పారు. దీనిని ఈడీ త‌రుఫు న్యాయ‌వాది కూడా అంగీక‌రించారు. జైలులో ఆమెకు అందే ఆహారం, నీటిని త‌నిఖీ చేయాల‌ని అధికారులకు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. కాగా అంతకు ముందు బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతడి సన్నిహితురాలు అర్పితను సిటీ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరినీ ఆగస్టు 18 వరకు కస్టడీకి పంపించారు. 

దళితుల హత్య కేసులో 27 మందికి యావజ్జీవం.. కోర్టు సంచలన తీర్పు

అర్పిత ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె తరఫు న్యాయవాది వాదించ‌గా.. దానిని అంగీక‌రిస్తూ నిందితురాలకి అందించే ఆహారం, నీటిని క్షుణ్ణంగా ప‌రీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ED తరపు న్యాయవాది చెప్పారు. పార్థ ఛటర్జీ తరపు న్యాయవాది బెయిల్ కోసం అభ్యర్థించారు. ఇప్పుడు ఆయ‌న వ‌ల్ల ఎవ‌రికీ హాని లేద‌ని తెలిపారు. ఇప్పుడు పార్థ ఛ‌ట‌ర్జీ రాజకీయ నాయ‌కుడు కాద‌ని, త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని అత‌డి త‌రుఫు న్యాయ‌వాది చెప్పారు. ‘‘ సీబీఐ కేసులో కానీ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కానీ తాము బాధితులం అంటూ, తమని లంచం అడిగారని గానీ ఎవ‌రూ బయటకు వచ్చి చెప్పలేదు. ఆయ‌న లంచం అడిగినట్లు సాక్ష్యం చూపించగలరా? పార్థ ఛటర్జీకి నేరంతో సంబంధం లేదు. సీబీఐ ఆరోప‌ణ‌లు స‌రైన‌వి కావు’’ అని పార్థ తరపు న్యాయవాది వాదించారు.

కొనసాగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. ఓటు వేసిన ప్రధాని మోదీ.. ఈరోజే వెలువడనున్న ఫలితం..

‘‘ జులై 22వ తేదీన ఈడీ అతడి ఇంటిపై దాడి చేసినప్పుడు ఏమీ దొర‌క‌లేదు. మీరు నేరంతో సంబంధం లేని వ్యక్తిని ప్ర‌శ్న‌లు అడ‌గానికి ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న ఎలా స‌హ‌క‌రించ‌గ‌ల‌డు.’’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా అర్పితను మరి కొంత కాలం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాల‌ని ఈడీ ప్ర‌త్యేక కోర్టును కోరింది. దీంతో ఆమెను 18వ తేదీ వ‌ర‌కు క‌ష్ట‌డీలో ఉంచేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే పార్థ ఛ‌ట‌ర్జీ చేసుకున‌న బెయిల్ అభ్యర్థనను కోర్టు తిర‌స్క‌రించింది. ఆగస్టు 18వ తేదీన మ‌ళ్లీ హాజ‌రుకావాని ఇద్ద‌రు నిందితుల‌ను కోరింది. 

వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించినందుకు పెద్ద కుమారుడిని హత్య చేసిన తల్లి.. యూపీలో ఘటన

స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు చేసి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డార‌నే ఆరోప‌ణ‌ల‌తో పార్థ ఛ‌ట‌ర్జీని, అర్పితా ముఖ‌ర్జీల‌ను జూలై 23వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. అప్ప‌టి నుంచి వారు ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. అప్ప‌టి నుంచి వారిపై విచార‌ణ సాగుతూనే ఉంది. ముఖర్జీకి చెందిన నివాసాల నుంచి రూ.49.80 కోట్ల నగదు, నగలు, బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఆస్తులు, కంపెనీలకు సంబంధించిన పత్రాలు కూడా ఏజెన్సీకి అందాయని తెలిపింది. కాగా మ‌నీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఇద్దరినీ అరెస్టు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios