ఆపరేషన్ సిందూర్’లో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకేసారి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్‌లు, హ్యామర్ బాంబులు, లాయిటరింగ్ మ్యూనిషన్‌లను వినియోగించారు.

భారత సైన్యం టెక్నాలజీ ఆధారిత ఆయుధాలను వినియోగిస్తూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ‘ఓపరేషన్ సిందూర్’లో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకేసారి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. 
ఈ దాడుల్లో అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్‌లు, హ్యామర్ బాంబులు, లాయిటరింగ్ మ్యూనిషన్‌లను వినియోగించారు.

ఈ ఆపరేషన్ ద్వారా లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహావల్పూర్‌లో జైష్ ఇ మోహమ్మద్ స్థావరం, ముజఫరాబాద్, సియాల్‌కోట్, కోట్లి, గుల్పూర్, భింబర్, చక్ అమ్రు ప్రాంతాల్లోని మొత్తం తొమ్మిది ఉగ్ర కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.

ఈ దాడులు భారత భూభాగం నుంచి మాత్రమే జరిపినట్లు, పాక్ గగనతలాన్ని దాటి పోకుండానే ఈ కార్యకలాపాలు చేపట్టినట్టు భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దాడులకు అవసరమైన సమయ సమయానుకూల సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచే వచ్చిందని తెలిపాయి.

ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన టెక్నాలజీ 

లాయిటరింగ్ మ్యూనిషన్‌లు (Kamikaze Drones):

ఈ ఆయుధాలు లక్ష్యాన్ని గుర్తించి, గాల్లో వేచి ఉండి, దానిపై ఆటోమెటిక్ గా పడి.. తర్వాత పేలే పేలుతాయి. 
ఇది డ్రోన్‌ నిఘా, మిసైల్‌ దాడి లక్షణాలను కలిగివుంటుంది. సామాన్య పౌరులకు, ఇతరులకు హాని కలగకుండా నిర్దేశించిన లక్ష్యాలను మాత్రమే కచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. 

స్కాల్ప్ మిసైల్ (Storm Shadow):
ఈ క్రూయిజ్ మిసైల్‌ను పగలు, రాత్రి, అన్ని వాతావరణాల్లోనూ ఉపయోగించవచ్చు. 300 కిలోమీటర్ల రేంజ్ కలిగిన దీని ద్వారా, బంకర్‌లాంటి కట్టడాలను కూడా గ్యారంటీగా ధ్వంసం చేయొచ్చు. జీపీఎస్, ఇన్‌ర్సియల్ నావిగేషన్, టెర్రైన్ మ్యాపింగ్ టెక్నాలజీ ఆధారంగా ఇది చాలా కచ్చితత్వంతో పని చేస్తుంది.

హ్యామర్ బాంబులు:
హ్యామర్ (Highly Agile Modular Munition Extended Range) బాంబులు అన్ని వాతావరణాల్లో పని చేయగలవు. 70 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయోగించవచ్చు. ఫ్రాన్స్ కంపెనీ తయారు చేసిన ఈ బాంబులు శత్రు దేశాల జామర్లను కూడా దొరకుండా వెళ్లి దృఢమైన నిర్మాణాలను కూడా ఛేదించగలవు.

ఈ దాడుల అనంతరం భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది – “ఈ చర్యలు నిఖార్సైనవి, సమంజసమైనవి, మితమైనవే. పాక్ సైనిక స్థావరాలను లేదా పౌరులను లక్ష్యంగా చేయలేదు.” అని అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌ ద్వారా భారత సైన్యం ఉన్నత స్థాయి టెక్నాలజీ ఆధారిత రక్షణ సత్తాను ప్రపంచానికి చాటింది.